Allu Arjun: నేడు ఫాదర్స్ డే కావడంతో పెద్ద ఎత్తున సెలబ్రిటీలు తమ తండ్రులకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా తమ తండ్రి ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ తమ తండ్రికి ఫాదర్స్ డే శుభాకాంక్షలు తెలుపుతున్నారు.ఈ క్రమంలోనే ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ సైతం తన తండ్రి అల్లు అరవింద్ కు ఫాదర్స్ డే శుభాకాంక్షలు తెలిపారు.

అల్లు అర్జున్ తన తండ్రి అల్లు అరవింద్ తో కలిసి దిగిన ఫోటోని సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఎమోషనల్ పోస్ట్ చేశారు. ఈ సందర్భంగా ఈయన సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ ప్రపంచంలోని తండ్రులందరికీ ఫాదర్స్ డే శుభాకాంక్షలనీ తెలిపారు.ఈ ప్రపంచంలో నువ్వే బెస్ట్ ఫాదర్ హ్యాపీ ఫాదర్స్ డే నాన్న అంటూ తన తండ్రికి శుభాకాంక్షలు తెలియజేస్తూ చేసినటువంటి ఈ పోస్ట్ ప్రస్తుతం వైరల్ అవుతుంది.
ఇక అల్లు అర్జున్ కు తన తండ్రి అల్లు అరవింద్ అంటే ఎంతో ఇష్టమని ఇది వరకే పలు సందర్భాలలో తెలియచేశారు. గత కొద్దిరోజుల క్రితం ఒక షోలో పాల్గొన్నటువంటి అల్లు అర్జున్ దేవుడు ఉన్నారో లేదో తెలియదు కానీ నాకు అన్ని ఇచ్చిన దేవుడు మా నాన్న ఆయనే నాకు దేవుడు అంటూ తన తండ్రి గురించి ఎంతో గొప్పగా చెప్పారు.

Allu Arjun: తండ్రి అంటే ప్రేమ గౌరవం…
ఈ విధంగా తండ్రి అంటే ఎంతో ప్రేమ గౌరవం ఉన్నటువంటి అల్లు అర్జున్ నేడు ఫాదర్స్ డే కావడంతో తన తండ్రితో కలిసి దిగిన ఫోటోని షేర్ చేస్తూ ఫాదర్స్ డే శుభాకాంక్షలు తెలియజేశారు.అల్లు అర్జున్ సినిమాల విషయానికి వస్తే ప్రస్తుతం ఈయన పుష్ప 2 సినిమా షూటింగ్ పనులలో ఎంతో బిజీగా గడుపుతున్నారు.































