పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన భారీ పిరియాడికల్ యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘హరిహర వీరమల్లు’ జూలై 24న గ్రాండ్‌గా ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది. ఈ చిత్రం మీద అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. రిలీజ్‌కు ఒక రోజు ముందే, అంటే జూలై 23న పలు థియేటర్లలో ప్రీమియర్ షోలు వేయనున్నారు. అయితే ఈ సినిమా ప్రీమియర్ షోలు మాత్రం పరిమితమైన థియేటర్లలోనే ప్రదర్శించనున్నారు. రెగ్యులర్ షోలు మాత్రం జూలై 24నుంచి మొదలవుతాయి.

AAA థియేటర్‌లో ‘హరిహర వీరమల్లు’ షోలు లేకపోవడంపై చర్చ
ఈ నేపథ్యంలో, సోషల్ మీడియాలో ఇప్పుడు ఒక షాకింగ్ వార్త వైరల్ అవుతోంది. హైదరాబాద్ అమీర్‌పేటలో ఉన్న ప్రముఖ థియేటర్ ‘AAA’ (Allu Arjun Asian Arena) లో ‘హరిహర వీరమల్లు’ షోలు పెట్టలేదు అని వార్తలు వస్తున్నాయి. ఈ AAA థియేటర్ ప్రముఖ నటుడు అల్లు అర్జున్ పేరుతో నడుస్తోంది. సాధారణంగా అన్ని పెద్ద సినిమాలు ఈ థియేటర్‌లో ప్రదర్శించబడతాయి. కానీ పవన్ కళ్యాణ్ సినిమా మాత్రం లిస్ట్‌లో లేకపోవడంతో ఇది చర్చనీయాంశంగా మారింది.
ఇప్పటికే టికెట్ బుకింగ్స్ ప్రారంభమైన బుక్ మై షో (BookMyShow) యాప్‌లో హైదరాబాద్‌లోని చాలా థియేటర్లలో ‘హరిహర వీరమల్లు’ షోలు కనిపిస్తున్నాయి. కానీ AAA థియేటర్ లిస్టులో ఈ సినిమా ఉండకపోవడం గమనార్హం. ఇది చూసిన తరువాత నెటిజన్లు, ఫ్యాన్స్ అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. మెగా ఫ్యామిలీ మరియు అల్లు ఫ్యామిలీ మధ్య విభేదాల వలననే బన్నీ తన థియేటర్‌లో ఈ సినిమా ప్రదర్శించకుండా ఉంచారన్న గుసగుసలు వినిపిస్తున్నాయి.
సోషల్ మీడియాలో ‘మెగా ఫ్యామిలీ vs అల్లు ఫ్యామిలీ’ వార్
ఈ నేపథ్యంలో, అల్లు అర్జున్ అభిమానులు, పవన్ కళ్యాణ్ అభిమానులు మధ్య సోషల్ మీడియాలో చర్చలు ముదిరుతున్నాయి. గతంలో కూడా మెగా ఫ్యామిలీ అంతర్గత రాజకీయాలపై వార్తలు వచ్చాయి. ఇప్పుడు ఈ థియేటర్ విషయంలో మరోసారి ‘మెగా ఫ్యామిలీ vs అల్లు ఫ్యామిలీ’ మాటల యుద్ధానికి వేడి పెరిగినట్లు కనిపిస్తోంది. ఈ వివాదానికి నిజమైన కారణం ఏమిటో స్పష్టంగా తెలియాల్సి ఉంది కానీ, బన్నీ థియేటర్‌లో పవన్ సినిమా లేకపోవడం మాత్రం ఇప్పుడు హాట్ టాపిక్ అయ్యింది.


























