Allu Shirish: ప్రస్తుత కాలంలో ఎన్నో చిన్న సినిమాలు విడుదల అవుతున్నాయి అలాగే పాన్ ఇండియా స్టార్ హీరోల సినిమాలు కూడా ప్రేక్షకుల ముందుకు వస్తున్నాయి. ఇటీవల కాలంలో విడుదల అవుతున్న చిన్న సినిమాలకు పెద్దగా ఆదరణ లేదని చెప్పాలి. అదే ఒక స్టార్ హీరో సినిమా అయితే వందల్లో టికెట్ల రేట్లు పెట్టుకొని మరీ సినిమా చూడటానికి వెళ్తున్నారు కానీ చిన్న సినిమాలకు ఆదరణ కోల్పోతుందని చెప్పాలి.

ఎలాంటి సినీ బ్యాగ్రౌండ్ లేకుండా వచ్చిన హీరోల పరిస్థితి పక్కన పెడితే సినీ బ్యాక్ గ్రౌండ్ ఉన్న హీరోలు నటించిన సినిమాలను చూడటానికి కూడా ప్రేక్షకులు థియేటర్ కి రాకపోవడం గమనార్హం. అల్లు రామలింగయ్య ప్రముఖ నటుడు. ఇక ఆయన వారసుడిగా అల్లు అరవింద్ నిర్మాతగా ఎంతో మంచి సక్సెస్ అందుకున్నారు. ఇక అల్లు అర్జున్ నేషనల్ స్టార్ హీరోగా గుర్తింపు పొందారు.
ఇలా ఇంత బ్యాక్ గ్రౌండ్ ఉన్న ఫ్యామిలీ నుంచి ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టిన అల్లు శిరీష్ మాత్రం ఇండస్ట్రీలో ఇప్పటివరకు చెప్పుకోదగ్గ సక్సెస్ అందుకోలేకపోయారు. ఊర్వశివో రాక్షసివో సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చిన తరువాత కొంత గ్యాప్ తీసుకొని అల్లు శిరీష్ బడ్డీ అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు.
షో క్యాన్సిల్..
ఈ సినిమా ప్రమోషన్ల కోసం అల్లు శిరీష్ ఎంతో కష్టపడ్డారు. ఈ సినిమా విడుదలైన తర్వాత ఈ సినిమా చూడటానికి ప్రేక్షకులు థియేటర్ కి రాకపోవడంతో కొన్నిచోట్ల షో క్యాన్సిల్ చేసిన సంఘటనలు కూడా చోటు చేసుకున్నాయి. ఇలా షోలు క్యాన్సిల్ చేయడం అంటే అది నిజంగా అవమానమే అని చెప్పాలి. ఇలా ఒక స్టార్ సినీ ఫ్యామిలీ నుంచి వచ్చిన హీరో పరిస్థితి ఇలా ఉంటే మిగిలిన హీరోల పరిస్థితి ఏంటో అర్థం చేసుకోవచ్చు.



























