Allu Sneha, Kalyan Dev : ఐకాన్ స్టార్ అల్లు అర్జున్.. గురించి సినీ అభిమానులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. పుష్ప సినిమాతో పాన్ ఇండియా హీరోగా మారిపోయాడు. అయితే అభిమానులలో అల్లు అర్జున్ కి ఉన్న క్రేజ్ గురించి చెప్పాల్సిన పని లేదు. ఇది అలా ఉంచితే అల్లు అర్జున్ భార్య అల్లు స్నేహ కూడా తనవి, కుటుంబంతో సరదాగా ఉన్నప్పటి ఫోటోలను ఎప్పటికప్పుడు సోషల్ మీడియా లో పోస్ట్ చేస్తూ.. క్రేజ్ ని సంపాదించుకొంటోంది. ప్రస్తుతం స్నేహ పోస్ట్ చేసిన ఒక ఫోటోపై కళ్యాణ్ దేవ్ పెట్టిన కామెంట్ వైరల్ గా మారింది.

ఏకంగా ఫైర్ ఎమోజి తో…
అల్లు స్నేహ.. సోషల్ మీడియా లో చాలా యాక్టీవ్ గా వుంటూ, కుటుంబానికి సంబందించిన విషయాలు, తన ఫోటోలని అభిమానులతో పంచుకుంటూ బిజీగా ఉండేది. అయితే ఈ మధ్య అల్లు స్నేహ హీరోయిన్లకు ఏమి తీసిపోకుండా ఫోటోషూట్లతో ఫోటోలను పోస్ట్ చేస్తోంది. ఈ మధ్యనే బ్లాక్ డ్రెస్ లో ఫోటోలు వైరల్ అయిన సంగతి తెలిసిందే. ఇక ఇపుడు బంగారు వర్ణంలో మెరిసిపోయే చీరకట్టులోని ఫొటోస్ ను తన ఇన్ స్టాగ్రామ్ ద్వారా పోస్ట్ చేసింది.

ఈ ఫొటోస్ లో స్నేహ చాలా అందంగా కనిపిస్తోంది. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియా లో బాగా వైరల్ అవుతున్నాయి. అయితే ఈ ఫోటోలపై మెగా అల్లుడు కళ్యాణ్ దేవ్ స్పందిస్తూ కామెంట్స్ చేశాడు. కళ్యాణ్ దేవ్ ఫైర్ ఎమోజీతో పాటు స్నేహా.. అంటూ కామెంట్ చేసాడు. ప్రస్తుతం ఈ ఫోటోతో పాటు కళ్యాణ్ దేవ్ చేసిన కామెంట్ కూడా నెట్టింట వైరల్ గా మారింది.


































