సోషల్ మీడియాలో సెలబ్రిటీ కుటుంబాలు ఎప్పుడూ ఎంతో యాక్టివ్ గా ఉంటాయి. ఈ క్రమంలోనే అల్లు అర్జున్ కుటుంబం సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్ గా ఉంటూ వారి కుటుంబానికి సంబంధించిన విషయాలను అభిమానులతో పంచుకుంటూ ఉంటారు. అల్లు అర్జున్, అల్లు శిరీష్, స్నేహ రెడ్డి సోషల్ మీడియా లో ఎంతో యాక్టివ్ గా ఉంటారు. తాజాగా ఏ సెలబ్రిటీ భార్యకు లేని ఫాలోయింగ్ అల్లు అర్జున్ భార్య స్నేహారెడ్డి సంపాదించుకున్నారు. తాజాగా ఈమె ఇంస్టాగ్రామ్ లో నాలుగు మిలియన్ల ఫాలోవర్స్ ను సంపాదించుకొని రికార్డ్ క్రియేట్ చేశారు.

స్నేహ రెడ్డి సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ ఎప్పుడు తన పర్సనల్ విషయాలను, తన కూతురు అర్హ కొడుకు అయాన్ లకు సంబంధించిన విషయాలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ అభిమానులను సందడి చేస్తుంటారు. ఈ క్రమంలోనే సోషల్ మీడియాలో ఫుల్ ఫాలోయింగ్ ఉంది. ఈ క్రమంలోనే స్నేహ రెడ్డి షేర్ చేసిన ఫోటో ఒకటి ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
అల్లు అయాన్ ,అల్లు అర్హ చేసే అల్లరి పనులు, చిలిపి చేష్టల గురించి ఎప్పుడు అభిమానులతో పంచుకుంటారు. అదేవిధంగా ఈ అన్నాచెల్లెళ్ల మధ్య ఉన్న అనుబంధం గురించి గతంలో ఎన్నోసార్లు అభిమానులకు తెలియజేశారు.ఓసారి అల్లు అయాన్ తన బుల్లి చెల్లిని బండి పై ఎక్కించుకొని ఇల్లు మొత్తం చక్కర్లు కొట్టినటువంటి వీడియోను స్నేహ అభిమానులతో పంచుకున్నారు.
తాజాగా ఇప్పుడు ఆయాన్ తన చెల్లిని ఏకంగా భుజాలపై ఎత్తుకొని తిప్పుతున్నాడు. ఈ విధంగా ఈ అన్నాచెల్లెళ్ల మధ్య ఉన్న బంధాన్ని స్నేహ రెడ్డి తన కెమెరాలో బంధించి సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్నారు. ప్రస్తుతం ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారి ఎంతో మంది అభిమానులను ఆకట్టుకుంది.




























