Alok Kumar Maurya : ఉత్తర్ ప్రదేశ్ ప్రయాగ్ రాజ్ కి చెందిన అలోక్ కుమార్ అనే వ్యక్తి కథ ఇపుడు సోషల్ మీడియాలో బాగా పాపులర్ అయింది. భర్త మోసం చేసి భార్యను వదిలేయడం, ఆమె వేదన పడి న్యాయం కోసం చూసే రోజులు పోయి భార్య చేసిన మోసానికి బలై న్యాయం కోసం పోరాడుతున్న వ్యక్తే అలోక్ కుమార్ మౌర్య. పంచాయతీ రాజ్ శాఖ లో ప్యూన్ గా పనిచేస్తున్న అలోక్ కుమార్ మౌర్య తన భార్యను కష్టపడి చదివించి, పబ్లిక్ సర్వీస్ ఎగ్జామ్స్ రాయించి భార్యను గ్రూప్ 1 ఆఫీసర్ ను చేసాడు. కానీ అందుకు భార్య జ్యోతి మాత్రం మోసం చేసి గొప్ప బహుమతి ఇచ్చింది. అదనంగా అతని మీదే వరకట్నం వేధింపుల కేసు పెట్టింది.

భర్తను మోసం చేసి నిస్సిగ్గుగా ప్రియుడితో…
అలోక్ కుమార్ మౌర్య జ్యోతి మౌర్యల వివాహం 2010 లో జరుగగా చదువంటే ఎంతో ఆసక్తి ఉండటంతో భార్యను డిగ్రీ చదివించి ఆపైన పీజీ చేయించిన అలోక్ కుమార్ సివిల్ పరీక్షలకు సిద్ధం చేయించాడు. తనకొచ్చే చాలీ చాలని జీతంలోనే చదివిస్తూ ఆమెను ఎగ్జామ్స్ కి ప్రిపేర్ చేసాడు. అయితే జ్యోతి కూడా బాగా చదివి స్టేట్ ర్యాంకర్ గా నిలిచి ఆర్టిఓ పోస్ట్ కొట్టింది. ఇక కష్టాలన్నీ పోయినట్లే అనుకున్నాడు అలోక్ కుమార్. వారి ఇద్దరి ఆడపిల్లల భవిష్యత్ బాగుంటుందని అనుకున్నాడు. కానీ ఎస్డిఎం ఆఫీసర్ అయ్యాక జ్యోతిని లక్నో కి బదిలీ చేసారు. అక్కడ జ్యోతి గాడి తప్పింది. హోమ్ గార్డ్ కమాండన్ట్ గా పనిచేస్తున్న మనిష్ దుబే అనే అధికారితో అక్రమ సంబంధం సాగిస్తూ భర్త పిల్లలని మోసం చేసింది.

ప్రభుత్వ క్వార్టర్స్ లోనే ఉన్న జ్యోతి వద్దకు చెప్పకుండా వెళ్లిన భర్త, పిల్లలకు గట్టి షాక్ తగిలింది. అయినా పిల్లల భవిష్యత్తు కోసం తప్పులను పక్కన పెట్టి భార్యను మారమని చెప్పినా ఆమె వినే పరిస్థితిలో లేదు. పైగా ఆలోక్ కుమార్ మీద అతని వృద్ధ తల్లిదండ్రుల మీద వరకట్న వేధింపు కేసు పెట్టింది. అలాగే విడాకులు ఇవ్వకపోతే అతడిని చంపేస్తానని బెదిరించింది. దేంతో పోలీసులను ఆశ్రయించిన అలోక్ కుమార్ కు ఫిర్యాదును పోలీసులు మొదట తీసుకోలేదు. చివరికి సీఎం ప్రజా దర్భార్ లో యోగి ఆదిత్య నాథ్ కి చెప్పడంతో ఆమె అవినీతి అలాగే భర్త ను మోసం చేసి చంపాలని చూస్తున్న కేసు మీద విచారణ జరపాలని పోలీసులను ఆదేశించారు. బరేలి కి బదిలీ అయిన జ్యోతి మీద కేసు నడుస్తోంది. ఇక ఆమె, ఆమె ప్రియుడు బాగోతం వాట్స్ అప్ చాట్స్ లీక్ అవడంతో యూపిలో ఆమె హాట్ టాపిక్ అయింది. ఇక ఆమెను నెటిజన్స్ కూడా బాగా ట్రోల్ చేస్తున్నారు.































