Amala: సినీనటి అక్కినేని నాగార్జున సతీమణి అమల గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు అమల ఎన్నో విభిన్న చిత్రాలలో హీరోయిన్గా నటించే ప్రేక్షకులను మెప్పించారు. ఈమె తెలుగు తమిళ భాష చిత్రాలలో హీరోయిన్ గా కొనసాగుతున్న సమయంలోనే నాగార్జునతో ప్రేమలో పడ్డారు.

నాగార్జునతో వరుస సినిమాలలో నటిస్తూ మంచి సక్సెస్ అందుకున్న అమల ఈయనతో సినిమాలు చేసే సమయంలోనే ప్రేమలో పడ్డారు ఇలా ప్రేమలో పడిన వీరిద్దరూ పెద్దల సమక్షంలో పెళ్లి చేసుకున్నారు అయితే అప్పటికే నాగార్జునకు పెళ్లి జరిగి నాగచైతన్య పుట్టిన తరువాత తన భార్య నుంచి విడాకులు తీసుకున్న సంగతి తెలిసిందే. ఇలా నాగార్జున అమలను రెండవ వివాహం చేసుకున్నారు.
ఇక హీరోయిన్ గా అప్పటివరకు వరుస సినిమాలలో నటిస్తున్న అమల పెళ్లి తర్వాత ఇండస్ట్రీకి దూరమయ్యారు. ఇక ఈ దంపతులకు అఖిల్ కూడా జన్మించారు. ఇటీవల కాలంలో పలు సినిమాలలో నటిస్తూ అమల బిజీగా ఉన్నారు. ఇదిలా ఉండగా తాజాగ అమలకు సంబంధించి ఒక వార్త వైరల్ అవుతుంది. నాగార్జునని అమల ప్రేమించి పెళ్లి చేసుకున్నప్పటికీ నాగార్జున తన ఫస్ట్ లవ్ కాదట.
తమిళ హీరో కార్తీక్..
నాగార్జున కంటే ముందుగా ఈమె తమిళ హీరో కార్తీక్ ప్రేమలో పడ్డారట అప్పట్లో ఈమె కార్తీక్ తో కలిసి వరుస సినిమాలలో నటించారు. ఈ సినిమాల సమయంలోనే ప్రేమలో పడ్డారని అయితే ఇద్దరి మధ్య విభేదాల కారణంగా తనకు బ్రేకప్ చెప్పడంతో ఈమె తెలుగు చిత్ర పరిశ్రమకు వచ్చారని తెలుస్తోంది. ఇలా ఈ హీరోతో బ్రేకప్ అయిన తర్వాత తిరిగి కోలీవుడ్ ఇండస్ట్రీలో ఎలాంటి సినిమాలలో నటించలేదు. అలా నాగార్జున కాకుండా హీరో కార్తీక్ తన ఫస్ట్ లవ్ అనే విషయం ప్రస్తుతం వైరల్ అవుతుంది.



























