Amar deep: బిగ్ బాస్ కార్యక్రమంలో కంటెస్టెంట్ గా పాల్గొన్నటువంటి వారిలో నటుడు అమర్ ఒకరు బుల్లితెర నటుడిగా ఎంతో మంచి సక్సెస్ అందుకున్నటువంటి ఈయన బిగ్ బాస్ కార్యక్రమంలో కంటెస్టెంట్ గా పాల్గొని సందడి చేశారు. ఈ కార్యక్రమం మొదట్లో ఈయన పలు ట్రోల్స్ ఎదుర్కొన్నప్పటికీ చివరికి ఈయన రన్నర్ గా బయటకు వచ్చారు.

బిగ్ బాస్ హౌస్ లో కొనసాగుతున్న సమయంలో శివాజీ మధ్య పెద్ద ఎత్తున గొడవలు జరుగుతూ ఉండేవి. వీరిద్దరూ టామ్ అండ్ జెర్రీ లాగా ఉండేవారు అయితే బయటకు వచ్చిన తర్వాత కూడా ఆ గొడవలు అలాగే కంటిన్యూ చేస్తున్నారని తెలుస్తుంది. వీరిద్దరూ వరుస ఇంటర్వ్యూలలో పాల్గొనడం ఒకరిపై మరొకరు విమర్శలు చేసుకోవడం జరుగుతుంది.
ఈ సందర్భంగా శివాజీ ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గొని అమర్ రన్నర్ అయ్యే అర్హత లేదని కావాలనే తనని ఎంకరేజ్ చేసి నన్ను నెగిటివ్గా చూపిస్తూ వచ్చారు అంటూ ఈయన ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. ఇక ఈ విషయం గురించి అమర్ స్పందిస్తూ ఇలాంటి వ్యాఖ్యలు శివాజీ గారు అన్నారంటే నేను ఆశ్చర్యపోతున్నాను. ఆయన హౌస్ లో ఉన్నన్ని రోజులు నువ్వు నాకు చాలా నచ్చావు రా అంటూ నన్ను పొగిడేవారు.
హౌస్ లో ఉన్నప్పుడు పొగిడారు…
బయటకు వచ్చిన తర్వాత మాత్రం నా గురించి ఇలా మాట్లాడుతున్నారు అంటూ అమర్ ఆశ్చర్యపోయారు . తేనె పూసిన కత్తి అంటారే శివాజీ కూడా అలాంటి వారే అంటూ శివాజీ గురించి చేస్తున్నటువంటి ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో సంచలనంగా మారాయి.































