Raviteja: బుల్లితెర నటుడిగా ఎంతో మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నటువంటి అమర్ ఇటీవల బిగ్ బాస్ కార్యక్రమంలో పాల్గొన్న సంగతి మనకు తెలిసిందే. ఈ కార్యక్రమంలో భాగంగా ఈయన మరింత క్రేజ్ సొంతం చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఈయన తనకు రవితేజ అంటే ఎంత ఇష్టం అనే విషయాలను పలు సందర్భాలలో బయటపెట్టారు.

ఇక రవితేజ సినిమా ప్రమోషన్లలో భాగంగా గ్రాండ్ ఫినాలే రోజు బిగ్ బాస్ వేదిక పైకి వచ్చారు. తనకోసం హౌస్ నుంచి బయటకు వస్తావా అంటు నాగార్జున అడగడంతో ఒక్క నిమిషం కూడా ఆలోచించకుండా రవితేజ కోసం అమర్ హౌస్ నుంచి బయటకు రాబోయారు. దీన్నిబట్టి ఆయన రవితేజకు ఎంత అభిమానినో అర్థం చేసుకోవచ్చు.
ఇక బిగ్ బాస్ వేదికపై రవితేజ అమర్ కి బంపర్ ఆఫర్ ఇచ్చారు. తాను నటించబోయే సినిమాలో తనుకు కూడా అవకాశం కల్పిస్తానని మాట ఇచ్చారు. అయితే తాజాగా రవితేజ ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారని తెలుస్తుంది. ఈ క్రమంలోనే రవితేజ నటించే సినిమాలో అమర్ కూడా నటిస్తున్నారని తెలుస్తుంది ఈ క్రమంలోనే రవితేజతో కలిసి దిగినటువంటి ఫోటోని అమర సోషల్ మీడియాలో షేర్ చేశారు.
ఫ్యాన్ బాయ్ మూమెంట్..
ఇలా రవితేజతో ఉన్నటువంటి ఫోటోని షేర్ చేసినటువంటి అమర్ ఈ ఫోటోకు . నా కల నెరవేరింది. నా దేవుడు నువ్వేనయ్యా. నువ్వంటే నాకు పిచ్చి, ఫ్యాన్ బాయ్ మూమెంట్ అంటూ పోస్ట్ చేసాడు. ఇక ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో అమర్ లక్కీ ఛాన్స్ కొట్టేసారంటే పలువురు ఈయనకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.



























