చాలా మందికి అంతరిక్షంలో ప్రయాణం చేయాలనే కోరిక ఉంటుంది. అయితే ఆ అవకాశం అందరికి రాదు. రానున్న కొద్ది రోజులలో అంతరిక్షంలోకి వెళ్లాలనుకునే వారి కల నెరవేరుతుందని చెప్పవచ్చు. అంతరిక్షంలో ప్రయాణం చేసి రావాలనే కోరిక అమెజాన్ అధినేత జెఫ్ బెజోస్ కి కూడా కలిగింది. తాజాగా ఆయన తన అంతరిక్ష ప్రయాణం కలను నెరవేర్చుకునే దిగ్విజయంగా తిరిగి వచ్చారు.

అమెజాన్ అధినేత జెఫ్ బెజోస్‌తో పాటు మరో ముగ్గురు కలిసి చేసిన ‘న్యూ షెపర్డ్’ ప్రయోగం విజయవంతమైంది. అమెజాన్ అధినేత అతని సోదరుడు మరో ఇద్దరు కలిసి ఈ ప్రయాణాన్ని కొనసాగించారు. పశ్చిమ టెక్సాస్ ఎడారిలోని ఓ మారుమూల ప్రాంతంలో లాంచ్ సైట్ నుంచి మంగళవారం సాయంత్రం ఈ ప్రయోగాన్ని నిర్వహించారు.
ఈ విధంగా ప్రారంభమైన ఈ ప్రయోగంలో రాకెట్ అంతరిక్షంలోకి గంటకు మూడు వేల 700 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తుంది. ఈ విధంగా రాకెట్ ప్రయాణించిన కొన్ని నిమిషాలకు వీరు సీట్ బెల్టులను తొలగించి, అంతరిక్షంలో తేలియాడుతూ ఎంతో అనుభూతి చెందారు. సుమారు 15 నిమిషాల పాటు సాగిన ఈ యాత్రలో భాగంగా ప్రయోగ వేదిక నుంచి 3.2 కిలోమీటర్ల దూరంలో రాకెట్ ల్యాండింగ్ పాడ్ కి చేరుకుంది.
ఈ క్రమంలోనే ఈ ‘న్యూ షెపర్డ్’ప్రయోగం విజయవంతమైందని విక్టరీ సంకేతాన్ని చూపుతూ అందులో నుంచి అమెజాన్ అధినేత బెజోస్, ఆయన మార్క్, మహిళా పైలట్ వేలీ ఫంక్, ఆలివర్ డేమన్ రాకెట్ నుంచి బయటకు దిగారు. ఈ విధంగా అంతరిక్ష ప్రయాణం చేసి తన కలను నెరవేర్చుకున్నందుకు బెజోస్ ఎంతో ఆనందం వ్యక్తం చేశారు.































