పండుగ వచ్చిందంటే చాలు.. అమెజాన్, ప్లిప్ కార్ట్ వంటి ఈ కామర్స్ సంస్థలు భారీగా ఆఫర్లను ప్రకటిస్తుంటాయి. రానున్న దసరా, దీపావళి వంటి పండుగలు రానున్నడంతో అమెజాన్ మరో భారీ సేల్ కు సిద్దం అవుతున్నాయి. ఈ ఏడాది కూడా అమెజాన్ అనే కామర్స్ సంస్థ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్‌ను ప్రకటించింది. వీటిలో ప్రతీ ఉత్పత్తి ఐటెంపై 40 శాతం వరకు డిస్కౌంట్ అందిస్తామని అమెజాన్ తెలిపింది.

స్మార్ట్‌వాచ్‌లు, ట్రూ వైర్‌లెస్ ఇయర్‌బడ్స్, స్మార్ట్ టీవీ, స్మార్ట్‌ఫోన్లు వంటి వాటిపై భారీ డిస్కౌంట్లు ఇవ్వనున్నట్లు పేర్కొంది. ఇంకా మరికొన్ని ఉత్పత్తులపై కూడా భారీ డిస్కౌంట్ ప్రకటించింది. అయితే ఈ సేల్ ఎప్పుడు.. మొదలవుతుంది అనే విషయాన్ని ప్రకటించాలి.
అక్టోబర్ లో ఈ సేల్ మొదలవుతుందని తెలుస్తోంది. హెచ్డీఎఫ్సీ బ్యాంక్ కు సంబంధించి డెబిట్ మరియు క్రెడిట్ కార్డులను కొనుగోలు చేసే వాటిపై 10 శాతం డిస్కౌంట్ అందించనున్నట్లు పేర్కొంది. మరో క్రెడిట్ కార్డు ఐసీఐసీఐ క్రెడిట్ కార్డును ఉపయోగించి కూడా 5 శాతం క్యాష్ బ్యాక్ కూడా ఇవ్వనున్నట్లు ప్రకటించింది.
ఇంకా దీనిలో అమెజాన్ ప్రైమ్ మెంబర్స్ కు ఒక రోజు ముందుగానే అంటే 24 గంటల ముందు సేల్ అనేది యాక్సెస్ అవుతుందని పేర్కొంది. ఫ్యాషన్ ఉత్పత్తుల కొనుగోలు అదనంగా రూ. 300 క్యాష్‌బ్యాక్‌ను అందించనుంది. ఈ సేల్‌లో భాగంగా స్మార్ట్‌ఫోన్ కొనుగోలుపై ఫ్రీ స్క్రీన్ రిప్లేస్‌మెంట్ ఆఫర్‌ను అందించనుంది. ఫైర్ టీవీ స్టిక్, ఎకో డివైజెస్, కిండెల్ లాంటి అమెజాన్ ఉత్పత్తులపై భారీ తగ్గింపును అందించనుంది.






























