Ambanti: ఏపీ డిప్యూటీ సీఎం సినీ నటుడు పవన్ కళ్యాణ్ గురించి తాజాగా వైకాపా మాజీ మంత్రి అంబంటి రాంబాబు చేసిన వ్యాఖ్యలు సంచలనగా మారాయి. ఇటీవల ప్రెస్ మీట్ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి ఈయన కాకినాడ పోర్టులో అక్రమంగా తరలిస్తున్న రేషన్ బియ్యాన్ని సీజ్ చేసిన విషయం గురించి మాట్లాడారు.

ప్రస్తుతం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత లోకల్ ఎమ్మెల్యేలు ఏ చిన్న పని చేయించాలన్నా కూడా పెద్ద ఎత్తున టాక్స్ లు కట్టించుకుంటున్నారని తెలిపారు. ఇలా కూటమి నేతలందరూ కూడా అక్రమ సంపాదనపై కన్నేసారని తెలిపారు. ఇసుక మాఫియా నుంచి మొదలుకొని మద్యం అలాగే చివరికి బూడిద కోసం కూడా కొట్టుకుంటున్నారు అంటూ ఈయన పరోక్షంగా జేసీ అలాగే ఆదినారాయణ రెడ్డి వివాదం గురించి కూడా మాట్లాడారు.
ఇక కాకినాడ పోర్ట్ నుంచి అక్రమంగా వెళుతున్నటువంటి రేషన్ బియ్యం గురించి కూడా మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ అక్కడికి వెళ్లి అధికారులతో మాట్లాడుతున్న తీరుపై ఈయన స్పందించారు. రెండు నెలల నుంచి నన్ను ఈ పోర్టు తనిఖీ రావడానికి అడ్డుకుంటున్నారని ఈయన మాట్లాడటంతో అసలు పవన్ కళ్యాణ్ అధికారంలో ఉన్నానని భావిస్తున్నారా లేకపోతే ఇంకా ప్రతిపక్షంలోనే ఉన్నాను అనుకుంటున్నారా అంటూ ఎద్దేవా చేశారు.

Ambanti:ప్రశ్నిస్తూనే ఉన్నారు..
పవన్ కళ్యాణ్ కు లెక్క లేనంత తిక్క ఉందని తెలిపారు. ఈయన అధికారంలో ఉన్నప్పటికీ కూడా ఇంకా ప్రతిపక్షంలో ఉన్నట్టుగానే ప్రశ్నించడం హాస్యాస్పదమై తెలిపారు.. పవన్ కళ్యాణ్ ను రెండు నెలలుగా పోర్టుకు వెళ్లకుండా అడ్డుకుంటున్నారని ఆయన మాట్లాడిన తీరుపై సందేహాలు కలుగుతున్నాయి. బహుశా చంద్రబాబు నాయుడు లోకేష్ ఈయనని అక్కడికి వెళ్లకుండా అడ్డుకున్నారేమో అంటూ ఈయన మాట్లాడారు. అసలు డిప్యూటీ సీఎంకు అంతలా ప్రాధాన్యం ఇవ్వొద్దనే అధికారులు అలా ప్రవర్తించారేమో. ఇక కూటమినేతల సహకారంతోనే ఈ స్కాం జరుగుతుందని ఈయన మండిపడ్డారు.




























