Ambanti Rayudu: భారత మాజీ క్రికెటర్ అంబటి రాయుడు వైసిపి ప్రభుత్వం పై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈయన తన క్రికెట్ కి రాజీనామా చేసి వైసిపి పార్టీలోకి వచ్చిన సంగతి మనకు తెలిసిందే ఇలా వైఎస్సార్సీపీ పార్టీలోకి వచ్చినటువంటి ఈయన కొంతకాలం పాటు ఆ పార్టీలో ఉండలేక తిరిగి పార్టీకి రాజీనామా చేసి జనసేన పార్టీలోకి చేరారు.

ఇలా జనసేన పార్టీలోకి చేరినటువంటి అంబటి రాయుడు ప్రస్తుతం జనసేన ప్రచార కార్యక్రమాలలో పాల్గొంటున్న సంగతి తెలిసిందే. అయితే తాజాగా ఈయన పవన్ కళ్యాణ్ తో కలిసి విశాఖ సౌత్ నియోజకవర్గంలో కూటమి తరపున ప్రచార కార్యక్రమాలను నిర్వహించారు. ఈ ప్రచార కార్యక్రమాలలో భాగంగా వైఎస్ఆర్సిపి పార్టీపై నిప్పులు చెరిగారు.
వైసీపీ పార్టీలో ఒక్కడే రాజు మిగతా అందరూ కూడా అక్కడ బానిసలే అంటూ ఈయన మాట్లాడారు. ఇక వైసిపి ఓడిపోతేనే రాష్ట్రం బాగా పడుతుంది అందుకే ఆ పార్టీని ఇంటికి పంపించి కూటమిని గెలిపించండి కూటమి గెలిస్తేనే రాష్ట్రం అభివృద్ధి కూడా జరుగుతుంది అంటూ ఈయన కూటమికి మద్దతును తెలియజేశారు.
కూటమి వల్లే అభివృద్ధి..
ఇక పవన్ కళ్యాణ్ గురించి కూడా మాట్లాడుతూ చెడు మార్గంలో వెళ్తున్నటువంటి నన్ను పవన్ కళ్యాణ్ గారు మంచి మార్గంలోకి తీసుకువస్తూ నన్ను మంచి మార్గంలో నడిపిస్తున్నారని పవన్ కళ్యాణ్ పట్ల కూడా ఈయన చేసినటువంటి కామెంట్లు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. ఇలా వైసిపి పార్టీపై అంబటి రాయుడు చేసినటువంటి ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో సంచలనంగా మారాయి.





























