Ameesha Patel : బాలీవుడ్ లో హృతిక్ రోషన్ హీరోగా వచ్చిన ‘కహోనా ప్యార్ హై’ సినిమాతో మంచి నేమ్ ఫేమ్ సంపాదించుకున్న హీరోయిన్ అమీషా పటేల్ ఇక ఆ తరువాత వరుస ఆఫర్స్ తో బాలీవుడ్ లో దూసుకుపోయింది. ఇక టాలీవుడ్ లోనూ పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో ‘బద్రి’ సినిమాతో పవన్ కళ్యాణ్ తో జతకట్టి హిట్టు కొట్టింది. ఇక మళ్ళీ తెలుగులో మహేష్ బాబు తో కలిసి ‘నాని’ సినిమాలో మళ్ళీ ఎన్టీఆర్ ‘నరసింహుడు’ సినిమాలో నటించినా పెద్దగా హిట్ కాలేదు సినిమాలు. ఇక మళ్ళీ సినిమాలు తెలుగులో చేయలేదు అమీషా పటేల్.

చీటింగ్ కేసు సుప్రీం కోర్ట్ కి అమీషా కేసు…
దేశి మ్యాజిక్ లో అమీషా నటించడానికి 2.5 కోట్ల రూపాయలను నిర్మాత అజయ్ కుమార్ సింగ్ ద్వారా తీసుకుంది. అయితే మళ్ళీ వివిధ కారణాల వల్ల సినిమా చేయలేదు అమీషా కానీ తీసుకున్న అడ్వాన్స్ డబ్బును నిర్మాత కు తిరిగి ఇవ్వకపోవడంతో అయన పోలీసులను ఆశ్రయించాడు. పోలీసులు చీటింగ్ కేసు నమోదు చేయడంతో జార్ఖండ్ ట్రయల్ కోర్ట్ అమీషా నమ్మకం ద్రోహం, మోసం వంటి సెక్షనల కింద నోటీసులు జారీ చేసింది.

ఇక కేసు మీద అమీషా పటేల్ సుప్రీం కోర్ట్ తలుపు తట్టింది. సెక్షన్ 138 కింద ప్రొసీడింగ్స్ చేయాలని సుప్రీం కోర్ట్ ఆదేశాలు ఇవ్వడంతో ఇపుడు ఏమి జరుగుతోంది ఈ కేసుకు సంబందించి అనే ఉత్కంట అందరిలోనూ ఉంది. అమీషా గతంలో తన తల్లిదండ్రుల మీదనే తనను వేదిస్తున్నారంటు కేసు వేసి సంచలనం రేపింది. నాలుగు పదుల వయసు వస్తున్నా ఈ ముద్దుగుమ్మ ఇంకా పెళ్లి చేసుకోలేదు.































