Bindu Madhavi: తెలుగు బిగ్ బాస్ షో రోజుకో మలుపు తిరుగుతోంది. ఇంటి సభ్యుల గొడవలు, డాన్స్ లు, వివిధ పనులతో రోజూ సందడిగా సాగిపోతుంది. ఇదే క్రమంలో బిగ్ బాస్ మధ్య మధ్యలో ఇచ్చే టాస్క్ లు ప్రేక్షకులకు వినోదాన్ని కలిస్తున్నాయి. వారి టాలెంట్ తో వచ్చిన ప్రారంభ రోజు నుంచే బిగ్ బాస్ టైటిల్ కొట్టేందుకు సన్నాహాలు చేస్తున్నారు.

అయితే వింత వింత ఆటలతో, టాస్క్ లతో ఒక్కొక్కరి టాలెంట్ బయటికి వస్తోంది. ఈ నేపథ్యంలోనే బిగ్ బాస్ ఒక ఒక వినూత్నమైన టాస్క్ ఇచ్చినట్టు తెలుస్తోంది. ఇంట్లో ఉన్న పర్ఫెక్ట్ మ్యాచ్ ఎవరో తెలుసుకోమని చెప్పడమే కాకుండా, వారిని ఫిదా చేయాలంటూ ఆసక్తికరమైన పనిని అప్పజెప్పుతాడు బిగ్ బాస్. ఇక క్షణం ఆలస్యం చేయకుండా కంటెస్టంట్స్ తమ ప్రతాపాన్ని చూపించడానికి రెఢీ అవుతారు. ఈ క్రమంలోనే ముమైత్ ఖాన్, అజయ్ కోసం సిగరెట్ తాగడం మానేస్తానని అంటుంది.

అరియానా, మహేశ్‌కోసం ఆమ్లెట్ చేయడమే కాక స్వయంగా తినిపించి, అందర్నీ ఆశ్చర్య పరుస్తుంది. మరోపక్క శివను ఎలా ఇంప్రెస్ చేయాలా అని ఆలోచనలో పడుతుంది హమీదా. ఇదిలా ఉండగా, బిగ్ బాస్ మరో టాస్క్ ను ఇంటి సభ్యులకు ఇచ్చి అందర్నీ కట్టి పడేసే ప్రయత్నం చేస్తాడు. తొలి ప్రేమ అనుభవాలను పంచుకోవాలని బిగ్ బాస్ చెప్పడంతో కంటెస్టంట్స్ తమ తమ భావాలను వ్యక్త పరిచినట్టు తెలుస్తోంది.
అతని కోసం ఇంటినుంచి వెళ్లిపోయా…
ఈ టాస్క్ లో భాగంగా ఇంటి సభ్యురాలు బిందు మాధవీ కూడా తన లవ్ స్టోరీనీ బయట పెడుతుంది. తన మొదటి లవ్ బ్రేక్ అప్ అయ్యిందన్న ఆమె, అతని కోసం ఇంటి నుంచి కూడా వెళ్ళిపోయానని చెప్పుకొచ్చింది. కానీ మళ్ళీ ఇంటికి వెళ్దాం అనుకునే లోపే తన అమ్మ చనిపోయిందంటూ ఫోన్ వచ్చిందని ఆవేదన వ్యక్తం చేసింది. ఇక మిగతా వారు కూడా తమ తమ తొలి ప్రేమ అనుభవాలను ఎలా పంచుకున్నారు ?ఎవరి లవ్ స్టోరీ ఏంటీ అనే విషయాలు తెలుసుకోవాలంటే ఈరోజు ప్రసారం కాబోయే ఎపిసోడ్ కోసం ఎదురు చూడాల్సిందే..!






























