Rajashekar wife: బుల్లితెరపై ఓంకార్ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న ఇస్మార్ట్ జోడి కార్యక్రమం గురించి మనకు తెలిసిందే. ఈ కార్యక్రమం ద్వారా బుల్లితెర రియల్ జోడీలు ప్రేక్షకులను సందడి చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఈ కార్యక్రమం ద్వారా కొరియోగ్రాఫర్ అమ్మ రాజశేఖర్ మాస్టర్ ఆయన సతీమణి కూడా పాల్గొన్న సంగతి మనకు తెలిసిందే.

త్వరలోనే వాలెంటెన్స్ డే రావడంతో ఈ కార్యక్రమంలో భాగంగా ఈ వారం వాలెంటైన్స్ డే స్పెషల్ ఎపిసోడ్ షూట్ చేశారు. ఇందులో భాగంగానే భర్తలు వారి భార్యలను చూస్తూ ప్రేమ లేఖ రాయాలని ఓంకార్ చెప్పడంతో ప్రతి ఒక్కరూ వారి భార్యల పై ఉన్న ప్రేమను విభిన్న శైలిలో తెలియజేశారు.

ఈ క్రమంలోనే అమ్మ రాజశేఖర్ భార్య ఈ కార్యక్రమం ద్వారా ఎంతో ఎమోషనల్ అయ్యారు. తన జీవితం మొత్తం ఎప్పుడు అడ్జస్ట్ అవ్వడంతోనే గడిచిపోయిందని, తన జీవితంలో ఎప్పుడు లవ్వు గివ్వు అనే పదాలకు తావులేకుండా పోయిందని ఈ సందర్భంగా ఆమె తెలుపుతూ చాలా ఎమోషనల్ అయ్యారు.
ఆయన నుంచి ఎప్పుడు అలాంటివి అందుకోలేదు..
అందరిలాగే ప్రతి వాలెంటైన్స్ డే రోజు నేను కూడా ఎంతో ఎదురు చూసేదాన్ని ఆయన ఏదో ఒకటి ఇస్తారు.. చేస్తారు అని చూసేదాన్ని కానీ ఎప్పుడు లవ్ లెటర్స్, బెలూన్స్, గిఫ్ట్స్ అలాంటివేమీ తనకు ఆయన నుంచి ఎప్పుడూ రాలేదని ఈమె బోరున ఏడవడంతో అక్కడున్న అందరూ కూడా ఎంతో ఎమోషనల్ అయ్యారు.ఈ క్రమంలోనే ఈ కార్యక్రమానికి సంబంధించిన ప్రోమో విడుదల చేయడంతో ఈ ప్రోమో కాస్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
Celebrating Beautiful moments of love through made for each other theme in ishmart jodi#IshmartJodi2 Sat & Sunday at 9:00 pm on #Starmaa
— starmaa (@StarMaa) February 7, 2022
.#SundayFunday #Beమాsked pic.twitter.com/hDrB6nUuqJ
































