మా అమ్మ దగ్గరకు వేళ్ళను… కావాలంటే ఆమె మాఇంటికి వస్తుంది.. బాబాయ్ శ్రవణ్ పైనే….

0
406

ప్రణయ్ కేసులో నిందితుడు మారుతీరావు బలవన్మరణానికి పాల్పడిన సంగతి తెలిసిందే.. అయితే దీనిపై మారుతీరావు కూతురు అమృత స్పందించింది. తన తండ్రి పశ్చాత్తాపం వల్లనే ఆత్మహత్య చేసుకుని ఉంటారని మొదట అభిప్రాయపడిన ఆమె ఇప్పుడు మాట మార్చింది. మారుతీరావు ఆత్మహత్య చేసుకునేంత పిరికివాడు కాదని, ఆయనకు, అయన తమ్ముడు శ్రవణ్ కు మధ్య ఆస్తి గొడవలు ఉన్నాయని అభిప్రాయపడింది. ఈ నేపథ్యంలో మారుతిరావును శ్రవణ్ కొట్టినట్లు తెలిసిందని చెప్పింది.

మారుతీరావు ఒత్తిడివల్ల చనిపోయాడని తాను భావించడంలేదని, అయన మరణంపై శ్రవణ్ కి ఏమాత్రం బాధలేదని అయన తీరుపై అనుమానాలు వ్యక్తం చేసింది. బాబాయ్ శ్రవణ్ తనపై అనుమానం రాకుండా కావాలనే వీలునామాలో తన పేరు తీయించి ఉంటారని తెలిపింది అమృత. మారుతిరావుకు చట్టపరంగా శిక్ష పడాలని అనుకున్నాను కానీ ఆత్మహత్య చేసుకోవాలని ఏనాడూ కోరుకోలేదని తెలిపింది. మారుతీరావు తనతో కంప్రమైజ్ అయ్యేందుకు తన అత్తగారి ఇంటికి ఒక వ్యక్తిని పంపారని తనకు అత్తగారు మామగారి రూపంలో మరో కుటుంబం ఉన్నందున తన తల్లే కావాలనుకుంటే మా ఇంటికి రావొచ్చని తెలిపింది. తల్లి దూరమైనా భాధ తనకు ఉందని అలాగని ఇప్పుడు ఉన్న కుటుంబాన్ని వదిలిపెట్టలేనని తెలిపింది.

మారుతీరావు అంత్యక్రియలకు వెళ్ళినపుడు స్మశానంలో తనను అడ్డుకున్నారని, తన తల్లిని ఓదార్చేందుకు తాను అక్కడకు వెళ్లానని తెలిపింది అమృత. ఆస్తి గురించి తనకు పెద్దగా తెలియదని చెప్పిన అమృత కానీ మారుతీరావు, అయన భార్య అందరు శ్రవణ్ కంట్రోల్ లోనే ఉంటారని చెప్పింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here