Sri Anjaneyan: టాలీవుడ్ ఇండస్ట్రీలో యంగ్ హీరోగా దూసుకుపోతున్నటువంటి వారిలో నటుడు నితిన్ ఒకరు. ఈయన జయం సినిమా ద్వారా హీరోగా ఇండస్ట్రీకి పరిచయమయ్యారు అనంతరం వరుస సినిమాలలో నటిస్తూ కెరియర్ పరంగా బిజీ అయ్యారు. ఇకపోతే ఇటీవల కాలంలో నితిన్ అనుకున్న స్థాయిలో సక్సెస్ అందుకోలేకపోతున్నారు.

ప్రస్తుతం వరుస సినిమాలలో నటిస్తున్నటువంటి నితిన్ కెరియర్లో నటించినటువంటి చిత్రాలలో శ్రీ ఆంజనేయం సినిమా ఒకటి. కృష్ణ వంశీ డైరెక్షన్లో నితిన్ ఛార్మి హీరో హీరోయిన్లుగా నటించిన ఈ సినిమా పెద్దగా అనుకున్న స్థాయిలో ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. ఇక ఈ సినిమా విడుదలయ్యి సరిగ్గా నేటికీ 20 సంవత్సరాలు పూర్తి అయింది.
ఈ క్రమంలోనే ఈ సినిమాకు సంబంధించి కొన్ని విషయాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ సినిమాలో హీరోయిన్ గా చార్మి నటించిన కానీ ఫస్ట్ ఛాయిస్ ఛార్మి కాదని ఆర్తి అగర్వాల్ చెల్లెలు నటి ఆదితి అగర్వాల్ అని తెలుస్తుంది. ఈమె హీరోయిన్ గా రాఘవేంద్రరావు డైరెక్షన్లో అల్లు అర్జున్ నటించిన గంగోత్రి సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు.

అదితి అగర్వాల్…
ఈ సినిమా మంచి సక్సెస్ కావడంతో ఈమెకు తదుపరి సినిమా అవకాశాలు వచ్చిన పెద్దగా సక్సెస్ కాకపోవడంతో ఈమె కెరియర్ ముగిసిపోయింది. ఇక శ్రీ ఆంజనేయం సినిమాలో ఫస్ట్ ఛాయిస్ అదితి అగర్వాల్ అయినప్పటికీ ఇందులో ఎక్స్పోజింగ్ సన్నివేశాలు ఎక్కువగా ఉండటంతో ఈ సీన్లలో నటించే విషయంలో కృష్ణవంశీ అదితి అగర్వాల్ మధ్య భేదాభిప్రాయాలు రావడంతో ఈమె తప్పుకున్నారట. ఇక ఈమె తప్పుకోవడంతో ఈ సినిమాకు చార్మి కమిట్ అయినప్పటికీ ఈ సినిమా సక్సెస్ కాలేదు. అయితే చార్మి గ్లామర్ కు మంచి మార్కులే పడటంతో ఆమెకు తదుపరి అవకాశాలు కూడా వచ్చాయని చెప్పాలి.
































