Analyst Damu Balaji : వివేకానంద రెడ్డి మరణించి నాలుగేళ్లు కావొస్తున్న చంపింది ఎవరనీకాని ఎవరు చంపారనే విషయాలు స్పష్టంగా ఇప్పటికీ తెలియరాలేదు. ఏపీ సీఎం కి సొంత బాబాయ్ అయినా ఎవరు చంపారో ఇప్పటికీ తెలియక పోవడం పట్ల అటు విపక్షాల నుండి గట్టి విమర్శిలే ఎదుర్కొంటున్న జగన్ ఇంట్లోనే హంతకులున్నారనే కథనాలు వినిపిస్తున్న విమర్శకు కౌంటర్లు వేస్తున్నారే కానీ కేసులో మాత్రం పురోగతి లేదు. రోజుకో పేరు బయటికి వస్తుంది ఎంపీ అవినాష్ రెడ్డి అరెస్టు అంటూ వార్తలు వినిపించినా అవేవి జరగలేదు. అయితే తాజాగా అవినాష్ రెడ్డిని విచారించడానికి సిబిఐ మరోసారి పిలవడం అవినాష్ రాలేనని చెప్పడం తాజాగా అవినాష్ రెడ్డి తల్లి శ్రీలక్ష్మి గుండెపోటు తో హాస్పిటల్ లో చేరడంతో ఆయన గడువు కోరడం వంటి ఆసక్తికర సంఘటనల నడుమ ఈ కేసులో ఏం జరగనుంది అన్నది అనలిస్ట్ దాముబాలాజీ మాట్లాడారు.

హాస్పిటల్ కి వెళ్లిన విజయమ్మ….
అవినాష్ రెడ్డి తల్లి పరిస్థితి ఇప్పటికీ ఆందోళనకారంగా ఉండటంతో ఆమె గుండె కు సంబంధించి రెండు వాల్వ్స్ పూర్తిగా పుడకుపోయాయని వెంటనే సర్జరీ చేయాల్సి ఉంటుందని చెప్పడంతో మరి కొంతకాలం గడువు కావాలని అవినాష్ రెడ్డి సిబిఐ ని అడుగుతున్నారు. అయితే తాజాగా శ్రీ లక్ష్మి గారిని పరామర్శించడానికి వైఎస్ విజయమ్మ వెళ్లడం కీలక పరిణామం అంటూ అనలిస్ట్ దాము బాలాజీ తెలిపారు.

కొన్ని టీడీపీ అనుకూల మీడియా మరీ శృతి మించి అవినాష్ ను అదుపులోకి తీసుకోవడం కోసం కేంద్ర బాలగాలు రంగంలోకి దిగాయంటూ కథనాలు ప్రసారం చేస్తున్నాయని అదంతా ఏమి లేదంటూ చెప్పారు. ఇక అవినాష్ రెడ్డి తనకు అనుకూలమైన సిబిఐ ఆఫీసర్ వచ్చేవరకు ఇలాంటివి ఏవో ఒకటి చెప్పి విచారణకు హాజరువ్వకుండా ఉండేందుకు ప్రయత్నిస్తాడని ఇవన్నీ అందరు రాజకీయా నాయకులు చేసేవే అంటూ బాలాజీ చెప్పారు.