Analyst Damu Balaji : కాల్పులు జరిపిన కార్తీక దీపం నటుడు… వివాహేతర సంబంధం కారణం…: అనలిస్ట్ దాము బాలాజీ

0
330

Analyst Damu Balaji : వివాహేతర సంబంధాలు, ఆర్థిక అవసరాలు నేటి సమాజంలో నేరానికి పురిగొల్పుతున్న అంశాలు. సహజీవనం అనే సంస్కృతి ఎక్కువైపోవడంతో నేడు అనేక హత్యలకు కారణం అని చెప్పొచ్చు. తాజాగా హైదరాబాద్ లో కాల్పులు జరగడం కలకలం రేపింది. శామీర్ పేట్ లోని సెలబ్రిటీ క్లబ్ లో ఒక వ్యక్తి మరో వ్యక్తి పైన ఎయిర్ పిస్టోల్ తో కాల్పులు జరుపగా వివాహేతర సంబంధం కారణం ఆంటూ పోలీసులు చెబుతున్నారు. ఈ ఇష్యూ గురించి అనలిస్ట్ దాము బాలాజీ మాట్లాడారు.

కార్తీక దీపం నటుడే కాల్పులు జరిపింది…

సిద్ధార్థ్ దాస్ అనే వ్యక్తికి గతంలోనే పెళ్లి జరిగి ఇద్దరు పిల్లలు ఉన్నారు. బాబు 15 ఏళ్ల వయసు కాగా పాప కు 9 ఏళ్ళు. ఇక భార్య భర్తల మధ్య గొడవలు జరగడంతో మూడేళ్లుగా సిధార్థ దాస్ తో భార్య విడిగా ఉంటోంది. పిల్లలను కూడా తన కస్టడిలోనే ఉండాలని కోర్ట్ నుండి అనుమతి తెచ్చుకుని హైదరాబాద్ లో ఉంటోంది. అయితే ఆమె మనోజ్ అనే మరో వ్యక్తితో సహజీవం చేస్తోంది. మనోజ్ కార్తీకదీపం సీరియల్ నటుడు మనోజ్ గా తొలుత భావించినా అతను కాదని క్లారిటీ ఇచ్చాడు.

మనోజ్ కి సాఫ్ట్ వేర్ కంపెనీ కూడా ఉంది. అయితే సాఫ్ట్వేర్ కంపేనీ లో సిద్ధార్థ్ దాస్ భార్యకి కూడా వాటా ఉంది. ఇద్దరూ కలిసి శామీర్ పేట్ లోని విల్లాలో ఉంటుండగా సిద్ధార్థ్ దాస్ పిల్లల కోసం రాగా వాగ్వాదం జరిగి మనోజ్ అతని మీద కాల్పులు జరిపాడు. ఎయిర్ పిస్టోల్ తో కాల్పులు జరపడం వల్ల ప్రాణానికి ప్రమాదం లేకపోయినా ఆ గన్ కి లైసెన్స్ లేకపోవడం వల్ల ఆ గన్ ఎవరిది, మనోజ్ కి ఎలా వచ్చింది వంటి విషయాల మీద తాజాగా పోలీసులు విచారణ చేపడుతున్నట్లు బాలాజీ తెలిపారు. పిల్లలను మనోజ్ హింసిస్తున్నందున బాబు చైల్డ్ వెల్ ఫేర్ అధికారులకు ఫిర్యాదు చేయడంతో బాబు అక్కడి నుండి బయటికి వచ్చాడు. ఇపుడు పాపను బయటికి పిలుచుకురావాలనే సిధార్థ దాస్ వచ్చినట్లు చెప్తున్నారు అంటూ బాలాజీ అభిప్రాయపడ్డారు.