Analyst Damu Balaji : చంద్రయాన్ 3 విజయవంతం… ఇపుడు ఎం జరుగుతుంది… ఈ ప్రయోగం వల్ల మనకేంటి లాభం…. రోవర్, ల్యాండర్ ఎం చేస్తాయి…: అనలిస్ట్ దాము బాలాజీ

0
57

Analyst Damu Balaji : వైఫల్యాలే గొప్ప పాఠాలు అని మన ఇస్రో శాస్త్రవేత్తలు నిరూపించారు. 2019 లో ప్రయోగించిన చంద్రయాన్ 2 వైఫల్యం తరువాతా మళ్ళీ కసి పనిచేసి చంద్రయాన్ 3 ను గత నెల లో ప్రయోగించారు. తాజాగా విక్రమ్ ల్యాండర్ చంద్రుడి దక్షిణ ధ్రువం లో సేఫ్ గా ల్యాండ్ అయి ప్రపంచం మొత్తం ఇండియా వైపు చూసేలా చేసింది. ఇప్పటి వరకు అమెరికా, చైనా, రష్యా కి సాధ్యం కానీ విషయంను సాధ్యం చేసి అది కూడ అతి తక్కువ ఖర్చులో చేసి చూపింది ఇస్రో. ఆగష్టు 23 న సాయంత్రం 6 గంటల 4 నిమిషాలకు జాబిలి దక్షిణ ధ్రువం మీద అడుగుపెట్టింది విక్రమ్ ల్యాండర్. ఇక విక్రమ్ ల్యాండర్ నుండి ప్రజ్ఞ రోవర్ బయటికి వచ్చి చంద్రుడి ఫోటోలను బెంగళూరు లోని ఇస్రో కార్యాలయం కు పంపుతుంది. ప్రయోగం విజయవంతం అయింది అంతా సరే కానీ అసలు ఈ ప్రయోగం వల్ల అసలేంటి లాభం అన్నది చాలా మందిలో ఉన్న సందేహం ఈ విషయాలను అనలిస్ట్ దాము బాలాజీ వివరించారు.

జాబిలి మీద నీటిజాడ తెలుసుకునే అవకాశం….

దాము బాలాజీ మాట్లాడుతూ చంద్రుడి మీద ఇంతకు ముందు అమెరికాతో సహా పలు దేశాలు ప్రయోగాలు చేసిన దక్షిణ ధ్రువం మీద మాత్రం ఇప్ప్పటికి ఎవరు వెళ్లలేకపోయారు. వాతావరణం ఏ మాత్రం లేని దక్షిణ ధ్రువం మీద ఇంతవరకు వెళ్లలేక పోయారు. ఇప్పుడు అక్కడికి భారత్ చేరుకోగలిగింది కాబట్టి అక్కడి పరిస్థితులు, నీటిజాడ, హీలియం నిక్షేపాలు వంటి విషయాలు తెలుస్తాయి. ఇక అక్కడ జీవి మనుగడకు గల పరిస్థితులు కూడ అర్థం అవుతాయి.

ఇక చంద్రుడి నుండి ఇతర గ్రహాల వద్దకు వెళ్ళడానికి కూడా వీలు ఉంటుంది కాబట్టి దక్షిణ ధ్రువం మీద భారత్ కి పట్టు దొరుకుతుంది. అలానే భవిష్యత్ లో తక్కువ ఖర్చుతో ఏదైనా ప్రయోగం చేయాలనీ ప్రపంచ దేశాలు భావిస్తే ఇస్రో వాటికి మంచి దారి చూపుతుంది. ప్రైవేట్ రంగలోకి స్పేస్ కి సంబంధించిన ప్రయోగాలు వెళ్లిపోవడం వల్ల భవిష్యత్ లో ఏదైనా సహాయం కావాల్సి ఇతర దేశాల ప్రైవేట్ సంస్థలు ఇస్రో ద్వారా ప్రయోగలను నిర్వహించుకుంటాయి. అలా విధేశి మారక ద్రవ్యం ఎక్కువగా ఇండియా సంపాదిస్తుంది. ప్రస్తుతం స్పేస్ కి సంబంధించి మనకు వ్యాపార పరంగా వస్తున్న లాభాలు 50 వేల కోట్లు కాగా భవిష్యత్ లో అది 80 లక్షల కోట్లకు చేరుతుందని అంచనా. త్వరలో సూర్యుడి మీద పరిశోధనలు చేయడానికి ఆదిత్య అలాగే శుక్ర గ్రహం మీద పరిశోధనలకు భారత్ శాస్త్రవేత్తలు సిద్ధమవుతున్నారు అంటూ బాలాజీ తెలిపారు.