Analyst Damu Balaji : ఈనాడు, మార్గదర్శి చిట్ ఫండ్స్ ఓనర్ అయిన రామోజీ రావు గారి మీద సిఐడి విచారణ జరగడం ఒక్కసారిగా చర్చకు దారితీసింది. సుమారు ఐదు గంటల పాటు ఆయనకు ప్రశ్నలు వేసింది సిఐడి. అయితే ఆయన విచారణలో పెద్దగా సమాధానాలు చెప్పలేదని బయటికి వినిపిస్తోంది. అయితే సిఐడి విచారణకు హాజరవుతున్నారు అనే సమయానికి అనారోగ్య కారణాలతో మార్గదర్శి ఎండి శైలజ కిరణ్ ఇంట్లో ఆయన పడుకుని ఉన్న ఫోటో సోషల్ మీడియాలో బాగా వైరల్ అయింది. ఇప్పుడు మరోసారి రామోజీ కి సంబంధించిన వీడియోస్ బయటికి రావడంతో చర్చ మొదలయింది. ఇక ఈ ఇష్యూ గురించి అనలిస్ట్ దాము బాలాజీ మాట్లాడారు.

జగన్ మాస్టర్ ప్లాన్ లో భాగమే…
రామోజీ రావు గారి మీద రాజకీయ కక్ష్యలో భాగంగా ఏపీ సీఎం జగన్ కావాలనే మార్గదర్శి చిట్ ఫండ్ లో అవకతవకలు జరిగాయని కేసు వేయించి అరెస్టు చేయించాలని చూస్తున్నారంటూ రామోజీ తరుపున వాళ్ళు మాట్లాడుతున్నారు. అంతే కాకుండా మార్గదర్శిలో అవకతవకలు జరిగాయని అందులో చిట్ ఫండ్ కట్టిన ప్రజలు ఎవరూ కేసు వేయలేదు కేవలం ఒక్క జిల్లాలో చిట్ ఫండడ్ కి సంబంధించిన ప్రభుత్వ అధికారి అందులో అవకతవకలు జరుగుతున్నాయని ఫిర్యాదు చేసారు. రాజశేఖర్ రెడ్డి గారు ఉన్న సమయంలోనే రామోజీ రావు గారి వ్యాపారాలను టార్గెట్ చేసారు. అప్పట్లో ఉండవల్లి అరుణ్ కుమార్ కు ఈ బాధ్యత అప్పగించారు. మార్గదర్శి కంపెనీ హిందూ అవిభజ్య కుటుంబ సంస్థ గా ఏర్పడింది. ఈ విషయం మీదే రాజశేఖర్ రెడ్డి సీఎం గా ఉన్న సమయంలో కేసు వేశారు. అయితే హై కోర్ట్ లో ఈ కేసు కొట్టేయగా మళ్ళీ ఉండవల్లి అరుణ్ కుమార్ సుప్రీం కోర్ట్ కి వెళ్లారు. అయితే ఈ కేసులో ఏపీ గవర్నమెంట్ ఇంప్లీడ్ పిటిషన్ వేయాల్సి ఉండగా ప్రస్తుతం ఉన్న జగన్ ప్రభుత్వం వేసింది. అలా కేసు మళ్ళీ తెరమీదకు వచ్చింది.

అలాగే సిఐడి దృష్టికి వెళ్లడానికి కారణం స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖ లోని జిల్లాకు చెందిన అధికారులు మార్గదర్శి మీద ఫిర్యాదు చేయడం వల్ల సిఐడి ఏడు కేసుల్లో A1 గా రామోజీ రావు, A2 గా మార్గదర్శి ఏండి శైలజ కిరణ్ ను పేర్కొన్నారు. మార్గదర్శిలో ప్రజల డబ్బునంతా ఇతర తమ వ్యాపారాల్లోకి అలాగే మూచ్యువల్ ఫండ్స్ లోకి మళ్ళించారని ఇది చిట్ ఫండ్స్ రూల్స్ కి విరుద్దమని పేర్కొన్నారు అంటూ బాలాజీ వివరించారు. అంతే కాకుండా తాజాగా విడుదల అయిన వీడియోలో రామోజీ రావు గారు తనకు 87 ఏళ్ల వయసు antu సీఐడి అధికారులతో చెప్పడం, తనకు గుండె సమస్యలు ఉన్నాయని చెప్తున్నా వాళ్ళు మీరు పడుకోండి మేము ప్రశ్నలు అడుగుతాం అనడం, నా ఆరోగ్యం బాగోలేదని చెప్పినా వదలరా అంటూ రామోజీ మాట్లాడటం ఉంది అంటూ చెప్పారు. రామోజీ రావు గారు ఇంతవరకు నన్ను పోలీసులు విచారించింది కానీ ఎపుడు జరగలేదు అంతా జగన్మాయా అంటూ మాట్లాడటం వీడియోలో తెలుస్తుంది. కావాలనే తప్పుడు కేసులు వేశారనే భావనలో మాట్లాడారు రామోజీ అంటూ బాలాజీ తెలిపారు. ఈ విషయంలో ఉండవల్లి మాత్రం ఆయన చెప్పేవి ఆపద్ధాలు, మార్గదర్శి పెట్టకముంది ఆయన ఒక రూమ్ లో చిట్ ఫండ్ నడిపేవాడు, అపుడు నాలుగు రోజులు అరెస్టు అయి పోలీస్ స్టేషన్ లో ఉన్నాడు అంటూ విమర్శించారని బాలాజీ తెలిపారు.