Analyst Damu Balaji : విజయమ్మ తో గొడవ పడిన షర్మిల… వైఎస్ శ్రీ లక్ష్మీని పరామర్శించినందుకు షర్మిల ఆగ్రహం…: అనలిస్ట్ దాము బాలాజీ

0
247

Analyst Damu Balaji : వివేకానంద రెడ్డి హత్య కేసులో పూటకో వార్త బయటికి వస్తున్నా అసలు నిందితులు బయటికి రావడం లేదు. అయితే సిబిఐ కావాలనే అవినాష్ రెడ్డిని టార్గెట్ చేస్తోందంటూ ఒకవైపు వినిపిస్తున్నా విచారణకు అవినాష్ రెడ్డి హాజరువ్వాల్సిన సమయంలో అవినాష్ రెడ్డి తల్లి శ్రీ లక్ష్మికి అనారోగ్యం కారణంగా హాస్పిటల్ కి తరలించడం, ఆ కారణంతో సిబిఐ విచారణకు గడువు కోరడంతో అవినాష్ రెడ్డి విచారణ తప్పించుకోడానికి కావాలనే ఇలా చేస్తున్నడంతు విపక్షాలు విమర్శిస్తుంటే మరోవైపు వైఎస్ శ్రీలక్ష్మి పరిస్థితి సీరియస్ గా ఉందని వైఎస్ కుటుంబ నుండి విజయమ్మ పరామర్శించారు. అయితే ఈ విషయంలో షర్మిల కోపంగా ఉందంటూ వార్తలు వస్తున్నాయని వాటి గురించి అనలిస్ట్ దాము బాలాజీ మాట్లాడారు.

సునీత కి సపోర్ట్ చేస్తున్న షర్మిల…

వైఎస్ కుటుంబంలో వివేకానంద రెడ్డి హత్య ప్రకంపనలు సృష్టిస్తోందని బాలాజీ తెలిపారు. ఒకవైపు జగన్ అవినాష్ రెడ్డికి సపోర్ట్ చేస్తుంటే ఆయన చెల్లి షర్మిల మాత్రం సునీత రెడ్డికి సపోర్ట్ చేస్తోంది. అయితే అవినాష్ రెడ్డి తల్లి వైఎస్ శ్రీలక్ష్మి అనారోగ్యంతో కర్నూల్ హాస్పిటల్ లో చికిత్స తీసుకుంటుండగా వైఎస్ విజయమ్మ ఆమెను పరామర్శించడం జరిగింది.

దీంతో షర్మిల విజయమ్మ మీద కోపంతో ఉందని వినిపిస్తోందంటూ బాలాజీ తెలిపారు. విజయమ్మ రాజకీయం వేరు కుటుంబం వేరు, నేను శ్రీలక్ష్మి మంచి స్నేహితులం అని నేను చూడటానికి వెళ్తానని చెప్పారట. అయితే విజయమ్మ కు సునీత, షర్మిల కొన్ని కండిషన్స్ పెట్టారని శ్రీలక్ష్మి ని చూడటానికి వెళ్లినా మీడియాతో మాట్లాడకూడదని చెప్పారని బాలాజీ అభిప్రాయపడ్డారు.