Analyst Damu Balaji: ఏపీ సీఎం సొంత బాబాయ్ 2019 లో తన ఇంట్లోనే దారుణంగా హత్య కు గురయ్యారు. అయితే ఈ కేసు లో విచారణ సీబీఐ కి అప్పగించిన ఇప్పటికీ సాగుతూనే ఉంది .ఒక వైపు నేనే చంపానని దస్తగిరి చెప్పి బెయిల్ మీద బయటికి రాగా సీబీఐ ఈ కేసులో మొదటి నుండి ఎంపీ అవినాష్ రెడ్డి కి సంబంధం ఉంది అనే కోణంలో విచారణ జరుపుతోంది. తాజాగా అవినాష్ రెడ్డి ఫోన్ కి సంబంధించిన కాల్ డేటాను సీబీఐ విడుదల చేస్తూ ఎవిడెన్స్ సంపాదించే పనిలో ఉన్నారు. ఈ విషయాలను అనలిస్ట్ దాము బాలాజీ వివరించారు.

అవినాష్ కాల్ లిస్ట్ లో ఏముంది….
మొదటి నుండి సీబీఐ అవినాష్ రెడ్డి అలాగే ఆయన తండ్రి భాస్కర్ రెడ్డి మీద అనుమానంతో ఉన్నారు . ఇప్పటికే భాస్కర్ రెడ్డిని అరెస్టు చేయగా అవినాష్ రెడ్డిని ఇప్పటికే పలు దఫాలు విచరించినట్లు చెప్పారు. అయితే ఆయనను అరెస్టు చేసే అవకాశం ఉందని పదే పదె వినిపిస్తున్న ఇప్పటికైతే సీబీఐ ఆ పనిచేయలేదు. కాగా తాజాగా సీబీఐ అవినాష్ రెడ్డి కాల్ డేటా ను సేకరించింది.

హత్యకు ముందు రోజు ఆయన ఎవరితో మాట్లాడాడు , లొకేషన్ ఎక్కడ ఉంది వంటి విషయాలను తెలుసుకున్నారు అంటు బాలాజీ తెలిపారు . అయితే ఈ విషయాల వల్ల కేసులో పురోగతి కనిపిస్తుందని చెప్పలేమని అసలు నిందితులను వదిలేసి అవినాష్ రెడ్డి వెనుక సీబీఐ పడుతోందని చాలా మంది భావిస్తున్నట్లు బాలాజీ తెలిపారు.