Analyst Damu Balaji : సరూర్ నగర్ అప్సర హత్య కేసులో ఇప్పటికే సాయి కృష్ణ తానే చంపినట్లు పోలీవుల విచారణలో ఒప్పుకున్నాడు. అయితే ఈ కేసులో రోజుకో కొత్త ట్విస్ట్ తెలుస్తోంది. అప్సర బ్యాక్ గ్రౌండ్ గురించి ఆసక్తికర విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఆమె మొదటి భర్త మరణం, ఆపైన హైదరాబాద్ కి తల్లి కూతుళ్ళు రావడం, ఇక్కడ సాయికృష్ణ తో ఎఫైర్ వంటి విషయాల మీద ఇప్పటికే పలు కథనాలు వినిపించాయి. అయితే తాజాగా పోలీసులు సాయి కృష్ణ అప్సర ను ఎలా హత్య చేసాడు. ఆమెను ఎలా మాన్ హోల్ లో వేసి సాక్ష్యాలు లేకుండా చేసాడో రీ కన్స్ట్రక్షన్ కార్యక్రమం చేసారు. ఇక ఈ విశేషాలను అనలిస్ట్ దాము బాలాజీ మాట్లాడారు.

సాయికృష్ణ పై గుర్రుగా ఉన్న స్థానికులు…
సాయికృష్ణ హత్య అనంతరం అప్సర శవాన్ని శంషాబాద్ నుండి సరూర్ నగర్ కు కారులో తీసుకువచ్చి కారులో శవాన్ని ఉంచి సరూర్ నగర్లో దేవుడి పూజ కార్యక్రమాలు, బొడ్డురాయి పునఃప్రతిష్ట వంటి క్రతువులను చేయడంతో అక్కడి జనాలు ఇప్పుడు ఆగ్రహంతో ఉన్నారంటూ బాలాజీ అభిప్రాయపడ్డారు. ప్రజల మనోభావాలతో సాయికృష్ణ ఆడుకున్నట్లుగా చాలా మంది భావిస్తున్నారని ఇప్పటికే శుద్ధి కార్యక్రమాలను చేసారు.

హత్య నేరం ఒప్పుకోవడం అలాగే సాక్ష్యాలను ధ్వంసం చేయడం వంటివి నేరాలుగా సాయికృష్ణ కు శిక్ష పడుతుంది. అయితే అతని ఆత్మహత్య చేసుకుంటానంటూ పలు సార్లు అనడం ఇక ఒకసారి ప్రయత్నించడం చేసాడని వినిపిస్తోందని బాలాజీ తెలిపారు. అప్సర గతంలో ఒకరు చనిపోడానికి కారణమైందనే కథనాల వల్ల సాయికృష్ణ నేరానికి ఎటువంటి సంబంధం లేదు అంటూ చెప్పారు.
































