Analyst Damu Balaji : రియల్ ఎస్టేట్ వ్యాపారంలో ఆర్థిక లావాదేవీలు ఒక వివాహిత ప్రాణాలను బలిగొన్నాయి. కరీంనగర్ పట్టణంలో గుండా సరిత అనే మహిళను దారుణంగా చంపి హంతకుడు పరారీలో ఉన్నాడు. కుటుంబ సభ్యుల కథనం ప్రకారం ఆర్థిక లావాదేవీలే ప్రధాన కారణంగా పోలీసులు భావిస్తున్నారు. గోదావరిఖని కి చెందిన 35 ఏళ్ల సరితకు భర్త ఇద్దరు పిల్లలు ఉండగా ఏడాది నుండి భర్తకు దూరంగా ఉంటున్నారు. ఇక ఈ ఇష్యూ గురించి అనలిస్ట్ బాలాజీ మాట్లాడారు.

డబ్బులు విషయంలో గొడవలే హత్యకు కారణం…
గోదావరిఖని కి చెందిన గుండా సరిత, శ్రీపాల్ రెడ్డి 2001 లో ప్రేమ వివాహం చేసుకుని గోదావరిఖని లోనే ఉండగా సరిత రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసేది. శ్రీపాల్ రెడ్డుకి భార్య రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయటం ఇష్టం లేకపోవడంతో తరచూ మనస్పర్తలు వచ్చాయంటూ బాలాజీ తెలిపారు. ఇక గత ఏడాది నుండి గొడవల కారణంగా భర్తకి దూరంగా ఉన్న సరిత కరీంనగర్ కి చెందిన వెంకటేష్ అనే వ్యక్తితో పరిచయం ఏర్పడటం అతనికి 25 లక్షల దాకా రియల్ ఎస్టేట్ వ్యాపారం కోసం ఇవ్వగా డబ్బు విషయంలో గొడవలు జరిగాయి.

వేసవి సెలవులవ్వడం వల్ల పిల్లతో సహా కరీంనగర్ లో ఉన్న తమ్ముడు ఆకుల సతీష్ ఇంటికి సరిత వెళ్ళింది. జూన్ 28 న గోదావరిఖనికి పిల్లను పంపిన సరిత వెంకటేష్ తో కలిసి పనిమీద వరంగల్ వెళ్తున్నట్లు చెప్పింది. అయితే మరుసటి రోజు తమ్ముడు ఫోన్ చేయగా వెంకటేష్ వాట్సాప్ కాల్ చేసి సరిత తల గోడకు కొట్టుకుని పడిందని కరీంనగర్ ఫ్లాట్ లోనే ఉందని చెప్పి ఫోన్ స్విచ్చాఫ్ చేసాడు. అక్కడికి చేరుకున్న సరిత తమ్ముడు సతీష్ ఆలాగే చెల్లి స్వాతికి సరిత రక్తపుమడుగులో గొంతుకు చున్నీ చుట్టబడి కనిపించందని వెంకటేష్ కోసం పోలీసులు గాలింపు చేపట్టారని బాలాజీ తెలిపారు.






























