Analyst Damu Balaji : బాబాల ముసుగులో పాస్టర్ల ముసుగులో కొంతంది చేస్తున్న మోసాలు, దుర్మార్గాలకు ఇండియాలో అంతే లేదు. రోజుకు ఎంతో మంది దొంగ బాబాల గుట్టు రట్టవుతున్నా ఇంకా అలాంటి బాబాలను నమ్మే మూఢ భక్తులు ఉన్నారు. ఆశ్రమాల పేరుతో చేసే చీకటి పనులు, లైంగిక వేధింపులు వంటివి వింటున్నా ఇలాంటివారిని నమ్ముతున్నారు జనాలు. ఇటీవలే కర్ణాటకలో మఠంలో స్వామి మీద అత్యాచారం ఆరోపణలు రావడం దేశవ్యాప్తంగా సంచలనం కాగా నేడు ఏపీ లోని వైజాగ్ లో ఇటువంటి సంఘటన చోటు చేసుకుంది. ఈ ఇష్యూ గురించి అనలిస్ట్ దాము బాలాజీ మాట్లాడారు.

పూర్ణానంద స్వామి అరెస్టు…
వైజాగ్ లో ఒక ఆశ్రమం నడుపుతున్న పూర్ణానంద స్వామి అలియాస్ పున్నయ్య స్వామి అనే వ్యక్తిని ఒక అమ్మాయిని లైంగికంగా వేధించాడు అనే ఆరోపణలతో అరెస్టు చేసి రిమాండ్ కి తరలించారు అంటూ బాలాజీ తెలిపారు. తల్లిదండ్రులు చనిపోయిన ఒక 13 ఏళ్ల అమ్మాయిని వైజాగ్ లోని పూర్ణానంద స్వామి ఆశ్రమంలో ఆమె బంధువులు చేర్పించగా అక్కడ ఆమెతో పశువుల పేడ తీయడం, ఊడ్చడం వంటి పనులను ఆశ్రంలో చేయించేవారట. అయితే పూర్ణానంద స్వామి ఆ అమ్మాయిని రాత్రి పూట తన గదికి తీసుకెళ్లి లైంగికంగా వేదిస్తూ ఉండటంతో పనిమనిషి సహాయంతో ఆ అమ్మాయి ట్రైన్ ఎక్కి విజయవాడ చేరుకుంది. ట్రైన్ లో పరిచయమైన మహిళ ద్వారా చైల్డ్ వెల్ఫేర్ హాస్టల్ కి వెళ్లగా అక్కడ ఎక్కడి నుండి వచ్చావు ఏం జరిగింది వంటి విషయాలను ఆరా తీసినపుడు విషయం బయటికి వచ్చింది.

రెండేళ్లుగా తనని లైంగికంగా వేదిస్తున్నట్లు చెప్పడంతో హాస్టల్ అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేసారు. అలా పూర్ణానంద స్వామిని అరెస్టు చేసి రిమాండ్ లో ఉంచగా ఆశ్రమంలో ముగ్గురు అబ్బాయిలు మరో ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు. ఇక ఈ విషయంలో అన్ని రాజకీయ పార్టీలు ఖండించగా కొందరు స్వాములు మాత్రం పూర్ణానంద స్వామి ఆశ్రమం కింద ఉన్న భూమిని కొట్టేయడానికి కొంతమంది రాజకీయ నాయకులు చేసిన కుట్ర అంటూ ఆరోపిస్తున్నారు. ఈ కేసులో నిజానిజాలు బయటికి రావాల్సి ఉంది అంటూ బాలాజీ అభిప్రాయపడ్డారు.































