Analyst Damu Balaji : 2019 ఎన్నికల ముందు రాష్ట్రంలో సంచలనం రేపిన హత్య కేసు వైఎస్ రాజశేఖర్ రెడ్డి తమ్ముడు వైఎస్ వివేకానంద రెడ్డి హత్య. తన ఇంట్లోనే రాత్రి బాత్రూంలో శవమై కనిపించారు వివేకానంద రెడ్డి. ఈ హత్య విచారణ తొలుత రాష్ట్ర పోలీసులు చేసినా కేసును తప్పుదోవ పట్టిస్తున్నారనే అనుమానంతో వివేకానంద రెడ్డి కూతురు సునీత గారు కోర్ట్ ను ఆశ్రయించి పక్క రాష్ట్రం అయిన తెలంగాణకు కేసును సిబిఐకి ట్రాన్సఫర్ చేయించుకున్నారు. సునీత రెడ్డి ఈ కేసు విషయంలో చాలా పట్టుదలగా ఉండగా సిబిఐ అవినాష్ వెనుకే పడింది అంటూ అనలిస్ట్ దాము బాలాజీ అంటున్నారు.

వైఎస్ మనోహర్ రెడ్డి ని సిబిఐ ఎందుకు పట్టించుకోలేదు…
అనలిస్ట్ దాము బాలాజీ మాట్లాడుతూ మొదటి నుండి కేసులో అవినాష్ రెడ్డి ఆయన తండ్రి భాస్కర్ రెడ్డి చుట్టూనే సిబిఐ ఇన్వెస్టిగేషన్ జరుగుతోందని తెలిపారు. వైఎస్ రాజారెడ్డి గారి అన్న కొడుకు అయిన మనోహర్ రెడ్డి కూడా వివేకానంద హత్య తరువాత మొదట వెళ్లిన వారిలో ఉన్నారు కానీ ఆయనని విచారణ జరుపలేదు. వివేకానంద హత్య జరిగాక రక్తపు మరకలను ఎర్ర గంగిరెడ్డి క్లీన్ చేయగా వాటిని క్లీన్ చేయించినపుడు భాస్కర్ రెడ్డి, అవినాష్ రిస్య్ లతో పాటు మనోహర్ రెడ్డి ఉన్నారు.

అయితే మనోహర్ రెడ్డి అటు అవినాష్ రెడ్డికి సన్నిహితంగాను అలాగే ఇటు సునీత రెడ్డికి సన్నిహితంగాను ఉంటారు అంటూ బాలాజీ తెలిపారు. గతంలో ఎమ్మెల్సి ఎన్నికలలో వివేకానంద పోటీచేస్తున్నపుడు మనోహర్ రెడ్డి గారు అవినాష్ క్యాంప్ లో ఉండటం, అక్కడ ఎమ్మెల్సి అభ్యర్థిగా పోటీ చేసిన వ్యక్తికి సహాయం చేయడం వల్ల వివేకానంద ఓడిపోయారు. ఇక ఆపైన మనోహర్ రెడ్డి కి, వివేకానందకు దూరం పెరిగింది. సునీత మనిషి కావడం వల్లే ఆయనను సిబిఐ విచారించడం లేదనే వాదనలు ఉన్నాయి అంటూ బాలాజీ తెలిపారు.

































