Analyst Damu Balaji : ఫోర్ ఎస్టేట్స్ లో ఒకటైన మీడియా ఆ ప్రభను ఏనాడో పోగొట్టుకుంది. ప్రజలకు, పాలకులకు మధ్య వారధిలా ప్రజల సమస్యల పరిష్కారానికి చొరవ చూపాల్సిన మీడియా నేడు వ్యాపార పరమైంది. ఒక్కో పార్టీ కి ఒక్కో మైకు గొట్టం లాగా ఏ పార్టీ వాళ్లకు వారి న్యూస్ ఛానెల్ ఉంటోంది. దీంతో జనాలు కూడా ఆ పార్టీ వైపు ఉంటే ఆ ఛానెల్ చూడటం లాగా వాళ్ళు విడిపోయారు. నేడు టిఆర్పిల కోసం వేటే తప్ప నిజమైన వార్తను ప్రజల ముందు పెట్టాలనే ఆత్రం కరువైన ఛానెల్స్ ఎక్కువగా ఉన్నాయి. మరీ ముఖ్యంగా మన తెలుగు రాష్ట్రల్లోని ప్రింట్ అలాగే ఎలక్ట్రానిక్ మీడియా గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది. అయితే తాజాగా ఇద్దరు లేడీ జర్నలస్ట్ లు గొడవ పడి ఆ విషయాన్ని పోటీలు పడి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం మన మీడియా పరువును ఎక్కడికో తీసుకెళ్ళింది. ఈ విషయం గురించి అనలిస్ట్ దాము బాలాజీ మాట్లాడారు.

కొట్టుకున్న రెండు లీడ్ ఛానెల్స్ జర్నలిస్ట్స్…
విజయవాడ సీఎంఓ కార్యాలయంలో న్యూస్ కవరేజ్ కోసం వెళ్లిన మీడియాలో ఒక రెండు లీడింగ్ ఛానెల్స్ కి సంబంధించిన మహిళా జర్నలిస్ట్స్ గొడవ పడటం నేటి సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయింది. నిజానికి వాళ్ళు అలా చేయడానికి కారణం ఆ న్యూస్ ఛానెల్స్ యాజమాన్యమే. రెండు ఛానెల్స్ టీఆర్పీ రేటింగ్స్ కోసం పోటీ పడుతున్నారు. ఈ మధ్య రెండో నెంబర్ లో ఎపుడూ ఉండే ఒక న్యూస్ ఛానెల్ మొదటి ప్లేసులోకి రావడంతో పార్టీ కూడా చేసుకున్నారు.

అయితే ఆ ఆనందం కొద్ది రోజులు మాత్రమే మిగిలింది. మళ్ళీ మొదటి ప్లేసులో ఎపుడూ ఉండే న్యూస్ ఛానెల్ మళ్ళీ నెంబర్ వన్ పొజిషన్ లోకి రావడంతో నెంబర్ వన్ లో ఉన్న ఛానెల్ ఏకంగా అన్ని ప్రధాన నగరాల్లోనూ మేమే నెంబర్ వన్ మోసంతో ఎవరూ ఏం చేయలేరు అంటూ హోర్డింగులను పెట్టి వారి మధ్య ఉన్న గొడవను బయటపెట్టుకుంది. ఆ పోటీతత్వమే ఇపుడు ఈ మహిళా జర్నలిస్తుల గొడవకు కారణం అయింది అంటూ బాలాజీ తెలిపారు.






























