Analyst Damu Balaji : శంకర్ దాదా ఏంబిబిఎస్ సినిమాలోని “ఏ జిల్లా ఏ జిల్లా” పాట వింటే అద్నాన్ సమి ఖాన్ గాత్రం గుర్తొస్తుంది. ఇక ఆ పైన వర్షం సినిమాలో ‘నచ్చావే నైజం పోరి నువ్వే నా రాజకుమారి’ అంటూ మరో హిట్ సాంగ్ తన ఖాతాలో వేసుకున్న ఈ పాకిస్థాన్ సింగర్ 2016లో ఇండియా పౌరసత్వం తీసుకుని ఇండియన్ అయిపోయాడు. అద్నాన్ సామి యూకే లో చదువుకుని లా చేసాడు, మరియు కెనడాలో తన జీవితాన్ని గడిపాడు. తండ్రి అర్షద్ సమీ ఖాన్ , పాకిస్తానీ వైమానిక దళ అనుభవజ్ఞుడు మరియు పష్టూన్ మూలానికి చెందిన దౌత్యవేత్త, ఇక తల్లి జమ్మూ మరియు కాశ్మీర్‌లోని భారత యూనియన్ భూభాగానికి చెందిన నౌరీన్‌లకు జన్మించాడు. అద్నాన్ సమి తెలుగు, కన్నడ, మలయాళం, తమిళం, హిందీ అంటూ పలు భాషల్లో పాటలు పాడాడు. అలాగే మ్యూజిక్ కూడా కంపోజ్ చేసాడు. ముఖ్యంగా అద్నాన్ సమి ప్రపంచంలోనే వేగమైన పియానో వాద్యకారుల్లో ఒకరు. అలాంటి అద్నాన్ సమి మీద ఆయన తమ్ముడు జునైద్ ఖాన్ వరుసగా గత కొన్ని రోజుల నుండి విమర్శలను చేస్తున్నారు. వీటి గురించి అనలిస్ట్ దాము బాలాజీ మాట్లాడారు.

తన చరిత్ర మొత్తం ఫేక్…
జునైద్ ఖాన్ తన అన్న గురించి చెబుతూ తాను రావల్పిండి లోనే జన్మించాడని, అక్కడే పెరిగాడని యూకే వెళ్లడం అక్కడ చదవడం అవన్నీ ఫేక్ అంటూ తెలిపారు. అద్నాన్ సమి మొదటి భార్య జెబా భక్తియర్ తో విడిపోయినపుడు ఆమె అనుమతి లేకుండా మూడేళ్ళ కొడుకును తీసుకుని దుబాయ్ పారిపోయాడని, ఇక రెండో భార్య సబా గిలదారి విషయంలో మరీ క్రూరంగా ప్రవర్తించడంటూ చెప్పాడు. సబా గిలదారి న్యూడ్ వీడియోను కోర్ట్ లో చూపించి విడాకులను తీసుకున్నాడని ఆ వీడియో తీయించింది తన అన్నే అని వదిన మంచిదంటూ జునైద్ కామెంట్స్ చేశారు.

ఇక ఇప్పుడు మూడో భార్య రోయా అతనితో ఎలా కాపురం చేస్తోందో అంటూ మాట్లాడుతూ తనని మ్యూజిక్ ఇండస్ట్రీలోకి తీసుకువస్తానని మాటిచ్చి నన్ను ఎదగనియ్యకుండా కుట్ర చేశాడంటూ జునైద్ ఆరోపించడం గురించి దాము బాలాజీ మాట్లాడుతూ ఇది నిజం అయి ఉండవచ్చు, అద్నాన్ కేవలం ఇండియాలో బిజినెస్ ఉంది కాబట్టి ఇక్కడి పౌరసత్వం తీసుకున్నాడు అతనికి దేశ భక్తి వంటివి లేవు. అదీ కాక తమ్ముడు ఏదిగితే పోటీ అవుతాడని భావించి ఇలా చేసుండొచ్చు అంటూ అభిప్రాయపడ్డారు అనలిస్ట్ బాలాజీ.


































