Analyst Damu Balaji : వివేకానంద హత్య కేసు అనేక మలుపులు తిరిగి మళ్ళీ అవినాష్ రెడ్డి అరెస్టు దగ్గరే ఆగుతోంది. ఎంపీ అవినాష్ రెడ్డి వివేకానంద ను హత్య చేయించారని ఈ కేసులో మొదటి నుండి ఆయనను అరెస్టు చేయాలని వైఎస్ వివేకానంద రెడ్డి కూతురు సునీత రెడ్డి కోరుకుంటున్నారు. అయితే ఎప్పటికప్పుడు కేసులో అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండగా తాజాగా సుప్రీం కోర్ట్ ను సునీత్ రెడ్డి ఆశ్రయించారు. అయితే రేపటికి వాయిదా వేసిన సుప్రీం కోర్ట్ రేపు తీర్పు ఏమివ్వనుంది అన్న విషయాలలో మీద అనలిస్ట్ దాము బాలాజీ మాట్లాడారు.

అవినాష్ రెడ్డి అరెస్టు తప్పదా…
తెలంగాణ హై కోర్ట్ కి కేసు బదిలీ చేయించుకున్న సునీత ప్రస్తుతం అక్కడ నుండి సుప్రీం తలుపు తట్టారు. అయితే సుప్రీం కోర్ట్ కేసును ఆల్రెడీ హై కోర్ట్ చూస్తున్నందున కల్పించుకోమని చెప్పగా సునీత తరుపున లాయర్లు సుప్రీం కోర్ట్ విచారించాలని కోరారు. దీంతో తీర్పును రేపటికి వాయిదా వేసింది సుప్రీం కోర్ట్.

అయితే రేపు సునీత కు అనుకూలంగా తీర్పు వస్తుందా లేక ఆమెకు వ్యతిరేకంగా వస్తుందో వేచి చూడాలి అంటూ బాలాజీ తెలిపారు. కేసులో మొదటి నుండి సునీత అవినాష్ రెడ్డి ని అరెస్టు చేయించాలి అనే ఉద్దేశంతోనే ఉన్నట్లు తెలుస్తుందని, ఆమెకు టీడీపీ నుండి సపోర్ట్ లభిస్తుండగా ఎంపీ రఘురామ క్రిష్ణం రాజు లీగల్ సైడ్ సహాయం చేస్తున్నారని బాలాజీ తెలిపారు.
































