Analyst KS Prasad : ఏపీ రాజకీయాల్లో అపుడే రాజకీయ వేడి మొదలైంది. ఎంఎల్సి ఎన్నికలలో టీడీపీ గెలవడం వైసిపి కి వ్యతిరేకత మొదలైనట్లుగా విమర్శలు వినిపిస్తున్నా మరోవైపు సీఎం ఢిల్లీ టూర్ అలాగే పవన్ కళ్యాణ్ కూడా ఢిల్లీ టూర్ అంటూ వెళ్ళడంతో రాజకీయంగా ఎపుడు బీజేపీ ఎవరికి సహకరిస్తుంది, పవన్ కు రోడ్ మాప్ ఎలా ఇచ్చింది అలాగే టీడీపీ, జనసేన బంధం ఎలా ఉండబోతోంది అన్న విషయాలు చర్చలకు దారి తీస్తున్నాయి. ఇక ఈ విషయాల మీద అనలిస్ట్ కేఎస్ ప్రసాద్ మాట్లాడారు.

పవన్ కు జగన్ కి తేడా ఉంది…
పవన్ ఢిల్లీ వెళ్ళింది బీజీపీ వాళ్ళు ఏం చెబితే అది చేయడానికి చిన్న పిల్లాడిలా ఎం చేయలన్నా బీజేపీ పెద్దలను అడుగుతుంటాడు. అందుకే సీఎం జగన్ ను పవన్ తో పోల్చకూడదు. నాకు తెలిసి ఇప్పటికే జనసేన పార్టీని బీజేపీ లోకి విలీనం చేసుంటాడు అంటూ విమర్శించారు. జగన్ ప్రభుత్వం పాలన పనుల మీద ఢిల్లీ వెళ్లారు కానీ పవన్ అలా కాదు వచ్చే ఎన్నికల దిశా నిర్దేశం కోసం వెళ్ళాడు. అతనికి దత్తపుత్రుడు అని నామకరణం చేసింది కూడా జగనే కదా.

చంద్ర బాబు వైపు నుండి వన్ సైడ్ లవ్ ఉంది అని అనుమానం రేకెత్తించి జగన్ వదిలాడు. ఇక పవన్ నిజంగానే చంద్ర బాబు తనను లవ్ చేస్తున్నాడేమో అని వాళ్లకు దగ్గరయ్యాడు. మా చేతులు ఖాళీ లేవు అని చంద్ర బాబు చెప్పినా వినకుండా వాళ్లకు దగ్గరయ్యాడు అంటూ పవన్ ను విమర్శించారు ప్రసాద్. అలా జగన్ పెట్టిన పేరును సార్ధకం చేసుకున్నాడు. ఇక ఢిల్లీ వెళ్లి బీజేపీ తో అక్షింతలు వేయించుకుని వస్తాడు ప్రతిసారీ అంటూ విమర్శించారు ప్రసాద్.

































