Connect with us

Featured

Rashmika: రష్మికను ఆనంద్ దేవరకొండ ఏమని పిలుస్తారో తెలుసా… తెలిస్తే షాక్ అవ్వాల్సిందే?

Published

on

Rashmika: నేషనల్ క్రష్ గా ఇండస్ట్రీలో వరుస సినిమాలలో నటిస్తూ దూసుకుపోతున్నటువంటి రష్మిక మందన్న విజయ్ దేవరకొండ ఫ్యామిలీకి చాలా క్లోజ్ అనే విషయం మనకు తెలిసిందే. ఈమె విజయ్ దేవరకొండతో కలిసి రెండు సినిమాలలో నటించారు. దీంతో వీరిద్దరూ రిలేషన్ లో ఉన్నారని అయితే ఈ విషయాలను బయట పెట్టడం లేదని వార్తలు వస్తున్నాయి.

Advertisement

ఈ వార్తలకు అనుగుణంగానే రష్మిక విజయ్ దేవరకొండ ఫ్యామిలీతో కలిసి వెకేషన్ లోకి వెళ్లడం ఏదైనా పండుగలు ఉంటే తన ఇంటికి వెళ్లి సెలెబ్రేట్ చేసుకోవడం వంటివి చేస్తూ ఉన్నారు. ఇక విజయ్ దేవరకొండతో పాటు తన తమ్ముడు ఆనంద్ దేవరకొండతో కూడా రష్మిక చాలా క్లోజ్ గా ఉంటారు అయితే ఇటీవల ఆనంద్ దేవరకొండ తన పుట్టినరోజు వేడుకలను జరుపుకున్నారు.

ఇలా ఆనంద్ పుట్టినరోజు కావడంతో సోషల్ మీడియా వేదికగా రష్మిక ఆనంద్ ఫోటోని షేర్ చేస్తూ తనకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ ఫోటోని షేర్ చేసినటువంటి రష్మిక హ్యాపీ బర్త్డే ఆనందా అంటూ కామెంట్స్ చేశారు. దీంతో ఈ పోస్ట్ ని తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో పోస్ట్ చేస్తూ థ్యాంక్యూ రషీ.. కానీ ఈ వరస్ట్ ఫోటో ఎందుకు పెట్టావు అని సరదాగా అన్నాడు.

రషీ….
ఇలా ఆనంద్ మాటలకు రష్మిక మళ్ళీ తన స్టోరీలో రిప్లై ఇస్తూ అందుకే నేను అడిగినప్పుడు మంచిగా పోజ్ ఇమ్మనేది అని సరదాగా పోస్ట్ చేసింది. ఇలా వీరిద్దరి సంభాషణ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది అయితే రష్మికను ఆనంద్ దేవరకొండ ముద్దుగా రషీ అని పిలుస్తారని ఈ సందర్భంగా బయటపడటంతో అభిమానులు కూడా తనని ఆ పేరుతోనే పిలుస్తూ కామెంట్లు చేస్తున్నారు.

Advertisement

Advertisement

Featured

Nagachaitanya: నాగచైతన్యకు 100 కోట్ల గిఫ్ట్… బన్నీ వాసు సంచలన వ్యాఖ్యలు!

Published

on

Nagachaitanya: సినీ నటుడు నాగచైతన్య త్వరలోనే తండేల్ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నారు. సాయి పల్లవి నాగచైతన్య జంటగా చందు మొండేటి దర్శకత్వంలో అల్లు అరవింద్ నిర్మాణంలో ఈ చిత్రం పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ సినిమా ఫిబ్రవరి 7వ తేదీ విడుదల కానున్న సంగతి తెలిసిందే.

Advertisement

ఈ సినిమా విడుదల తేదీని ప్రకటిస్తూ చిత్ర బృందం ప్రెస్ మీట్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ ప్రెస్ మీట్ కార్యక్రమంలో భాగంగా నిర్మాత బన్నీ వాసు మాట్లాడుతూ చేసిన కామెంట్స్ సంచలనంగా మారాయి. గీత ఆర్ట్స్ 2 బ్యానర్ అధినేతగా బన్నీ వాసు ఎన్నో సినిమాలను నిర్మించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే బన్నీ వాసు ఈ కార్యక్రమంలో నాగచైతన్య గురించి మాట్లాడుతూ ఆసక్తికరమైన విషయాలు తెలిపారు..

నన్ను నమ్మిన నాగచైతన్యకు నేను ఒక విలువైన బహుమతి ఇవ్వాలని అనుకుంటున్నాను.కో ప్రొడ్యూసర్ గా ఉన్న నన్ను నిర్మాతగా చేస్తానని అల్లు అరవింద్ అంటే నన్ను మొదటిసారి నిర్మాతగా చేసింది నాగచైతన్య. నాకు కొత్త జీవితాన్ని అందించబోతున్న నాగచైతన్యకు ఈ సినిమా ద్వారా సరికొత్త బహుమతి ఇవ్వబోతున్నాను.

100 కోట్ల క్లబ్..
నాగచైతన్య నటిస్తున్న తండేల్ సినిమాను 100 కోట్ల క్లబ్ లోకి తీసుకువెళ్తాను అదే నేను నాగచైతన్యకు ఇచ్చే అతిపెద్ద కానుక అంటూ బన్నీ వాసు తెలిపారు.ఇది నాగచైతన్యకు ఒక అరుదైన బహుమతిగా నిలిచిపోతుంది అంటూ చెప్పుకొచ్చారు. ప్రస్తుతం బన్నీ వాసు చేసిన ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Advertisement

Advertisement
Continue Reading

Featured

RK Roja: పవన్ కళ్యాణ్ ఎక్కడ… నీకు మాత్రమే కూతుర్లు ఉన్నారా: రోజా

Published

on

RK Roja: ప్రస్తుతం ఏపీ రాష్ట్ర రాజకీయాలు సంచలనంగా మారాయి. అధికారంలో ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం గురించి ప్రజలలో వ్యతిరేకత ఉందని బయటకు వస్తే తిడుతున్నారు అంటూ ఏకంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు చేయడంతో ఇది కాస్త చర్చలకు కారణమయ్యాయి. రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న దాడులను అల్లర్లను అరికట్టడంలో హోంశాఖ విఫలమైంది అంటూ కూడా కామెంట్ చేశారు.

Advertisement

ఇక ఈ విషయం పట్ల పలువురు నేతలు విభిన్న రకాలుగా స్పందిస్తూ కామెంట్లు చేస్తున్నారు. అయితే రోజా మాత్రం ఎప్పటికప్పుడు కూటమి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూనే ఉన్నారు. ఈమె అధికారంలో ఉన్నప్పుడు ప్రతిపక్ష నాయకుడు అయినటువంటి చంద్రబాబు నాయుడు పై అలాగే పవన్ కళ్యాణ్ పై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. ప్రస్తుతం ఈమె అధికారంలో లేకపోయినా తరచూ పవన్ కళ్యాణ్ గురించి ఏదో ఒక విమర్శ చేస్తూనే ఉన్నారు.

పవన్ కళ్యాణ్ ఒక ఎమ్మెల్యేగా ఫెయిల్యూర్ అయ్యారని రోజా ఆరోపణలు చేశారు అయితే తాజాగా ఈమె మరొక వీడియోని షేర్ చేశారు. ఇందులో భాగంగా తన గురించి సోషల్ మీడియాలో చేసిన అసభ్యకరమైన పోస్టుల పట్ల స్పందించారు. పవన్ కళ్యాణ్ కి మాత్రమే కూతుర్లు ఉన్నారా.

నా కూతురు ఏ తప్పు చేస్తుంది..
మాకు కూతుర్లు ఉన్నారు నా కూతురు ఏ తప్పు చేసిందని సోషల్ మీడియాలో నా పట్ల నా కూతురు పట్ల దారుణమైన విమర్శలు చేశార.  ఆ సమయంలో పవన్ కళ్యాణ్ ఎక్కడ ఉన్నారు? నేడు అధికారంలో ఉన్న నంగి ఏడుపులతో మాట్లాడుతున్నారు అంటూ రోజా పవన్ కళ్యాణ్ గురించి చేసిన ఈ కామెంట్స్ సంచలనగా మారాయి.

Advertisement

Advertisement
Continue Reading

Featured

Sai pallavi: సాయి పల్లవితో డాన్స్ అంటే సవాల్.. హీరో నితిన్ కామెంట్స్ వైరల్!

Published

on

Sai pallavi: సినీనటి సాయి పల్లవి తాజాగా అమరన్ అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసినదే. ఈ చిత్రం మేజర్ ముకుంద్ వరదరాజన్ జీవిత కథ ఆధారంగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఉగ్రదాడిలో మరణించిన మేజర్ బయోపిక్ చిత్రం కావడంతో ఈ సినిమాకి మంచి ఆదరణ లభించింది.

Advertisement

ఈ సినిమాలో శివ కార్తికేయన్ సాయి పల్లవి జంటగా నటించారు.ఈ సినిమా తెలుగు హక్కులను నితిన్ తండ్రి సుధాకర్ రెడ్డి కొనుగోలు చేశారు. ఇక ఈ సినిమా తెలుగులో కూడా భారీ స్థాయిలో లాభాలను అందుకొని దూసుకుపోతుంది. తాజాగా ఈ సినిమా మంచి సక్సెస్ కావడంతో సక్సెస్ సెలబ్రేషన్స్ ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి హీరో నితిన్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.

ఈ సందర్భంగా నితిన్ మాట్లాడుతూ దీపావళి పండుగ సందర్భంగా మూడు సినిమాలు విడుదల కాగా మూడు మంచి సక్సెస్ అందుకున్నాయని తెలిపారు. ఇక ఈ సినిమా హక్కులను కొనుగోలు చేసేటప్పుడు ఎందుకు నాన్న ఈ సినిమా తెలుగు హక్కులను కొనుగోలు చేశావు అంటూ ప్రశ్నించాను. ఈ ప్రశ్నకు నాన్న సమాధానం చెబుతూ నేను కేవలం సాయి పల్లవి కమల్ హాసన్ పైన నమ్మకంతోనే ఈ సినిమా హక్కులను కొనుగోలు చేశానని తెలిపారు. నిజంగా ఈ సినిమాకు సాయి పల్లవి బ్యాక్ బోన్ అంటూ నితిన్ తెలిపారు.

నన్ను తినేస్తావు..
ఇక సాయి పల్లవి గురించి మాట్లాడుతూ సాయి పల్లవి డాన్స్ అంటే నాకు చాలా ఇష్టం ఏదైనా సినిమాలో తనతో కలిసి డాన్స్ చేయాలని ఉంది ఆమెతో డాన్స్ అంటే అది సవాల్ అని నాకు తెలుసు. అంటూ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. ఈ కామెంట్స్ తో సాయి పల్లవి థ్యాంక్స్ చెప్పాగా.. నువ్వు నన్ను తినేస్తావ్. కానీ, అది హెల్తీ కాంపిటీషన్. ఆ రోజు రావాలని కోరుకుంటున్నాను. ఈ సినిమాలో సాయి పల్లవి యాక్టింగ్ నేషనల్ అవార్డు విన్నింగ్ పర్ఫామెన్స్ అంటూ ప్రశంసలు కురిపించారు.

Advertisement

Advertisement
Continue Reading
Advertisement

Trending

Don`t copy text!