Anand Mahindra: రాజమౌళి దర్శకత్వంలో పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిత్రం RRR.ఈ సినిమా దేశవ్యాప్తంగా కాకుండా అంతర్జాతీయ స్థాయిలో కూడా ఎంతో మంచి ఆదరణ సంపాదించుకుంది.ఇక ఈ సినిమా ఇప్పటికీ ఎన్నో పురస్కారాలను అందుకోగా తాజాగా నాటు నాటు పాటకు గాను గోల్డెన్ గ్లోబ్ అవార్డును సొంతం చేసుకుంది.

ఇక ఈ పాటకు గోల్డెన్ క్లబ్ అవార్డు రావడంతో చిత్రబృందం ఎంతో సంతోషం వ్యక్తం చేశారు. ఇక ఈ సినిమాలో పాటలు, ప్రతి ఒక్క యాక్షన్ సన్నివేశాలు అందరినీ ఎంతగానో ఆకట్టకుంటున్నాయి. అయితే ఈ సినిమా విడుదల సమయంలో నాటు నాటు ఒరిజినల్ సాంగ్ ఇదే అంటూ ఒక వీడియో వైరల్ గా మారింది.అయితే మరోసారి ఈ పాట గోల్డెన్ గ్లోబ్ అవార్డు అందుకోవడంతో ఈ పాట మరొక్కసారి వైరల్ అవుతుంది.
ఇద్దరు హాలీవుడ్ నటులు అచ్చం నాటు నాటు పాటలు రామ్ చరణ్ ఎన్టీఆర్ చేసిన విధంగానే డాన్స్ చేయడంతో ఈ వీడియోని ఆనంద్ మహేంద్ర సోషల్ మీడియా వేదికగా షేర్ చేశారు. ఇక్కడ ఏ పాట ఉందనే విషయం తెలియకపోయినా ఆ విజువల్ కినాటు నాటు ఆడియో యాడ్ చేశారు. దీంతో ఈ వీడియో ఆనంద్ మహేంద్ర కంటపడటంతో ఆయన సోషల్ మీడియా వేదికగా షేర్ చేశారు.

Anand Mahindra: ఆర్ఆర్ఆర్ హీరోల ఎనర్జీ ఉండకపోవచ్చు…
ఈ సినిమా విడుదలైన సమయంలో ఈ పాట వైరల్ గా మారింది. ఇప్పుడు మరోసారి వైరల్ అవుతుంది. నాటు నాటు మేనియా నుంచి ఎవరు తప్పించుకోలేరు. ఈ వీడియోలోని ఈ రెండు పాత్రలలో ఆర్ఆర్ఆర్ హీరోల్లో కనిపించినంత ఎనర్జీ ఉండకపోయినా ఎంజాయ్ చేయండి అంటూ ఈయన ఈ వీడియోని షేర్ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ గా మారడంతో కొందరు ఈ వీడియో పై స్పందిస్తూ ఇదే ఒరిజినల్ నాటు నాటు సాంగ్ అంటూ ఫన్నీగా ట్రోల్ చేస్తున్నారు.
No one is immune from the catchiness of #NaatuNaatu. Not even inhabitants of the past..???? L&H may not have the same energy as the #RRR duo but they’re not bad! Enjoy the #FridayFeeling pic.twitter.com/9tMSfAKux5
— anand mahindra (@anandmahindra) January 13, 2023



































