ప్రస్తుత కాలంలో వయసుతో సంబంధం లేకుండా చిన్న పిల్లల నుంచి పెద్దవారి వరకు సెల్ ఫోన్ వినియోగం విపరీతంగా పెరిగిపోయింది. సెల్ ఫోన్ పక్కన లేకపోతే కనీసం నిద్ర కూడా పట్టడం లేదు. మరికొందరు సెల్ ఫోన్ చూస్తూనే వారి రోజు కార్యకలాపాలను కొనసాగిస్తుంటారు.ఈ విధంగా నిత్యం సెల్ ఫోన్ వాడటం వల్ల ఎన్నో ప్రమాదాలు చోటు చేసుకున్న సంఘటనలను గురించి మనం వినే ఉంటాం.

తాజాగా సెల్ ఫోన్ వాడకం గురించి భారతీయ పారిశ్రామికవేత్త మహేంద్ర ఆనంద్ అతిగా సెల్ ఫోన్ వాడటం వల్ల కలిగే అనర్థాలకు సంబంధించిన ఓ వీడియోను సోషల్ మీడియా వేదికగా షేర్ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారి ఎంతోమంది నెటిజన్లను ఆకట్టుకుంది.
ఈ క్రమంలోనే ఆనంద్ మహేంద్ర మాట్లాడుతూ ఒకసారి తను సెల్ ఫోన్ వాడుతూ ట్రావెల్ చేస్తున్నప్పుడు రెండు ప్రమాదాలు చోటుచేసుకున్నాయని అప్పటి నుంచి తను ట్రావెల్ చేస్తున్నప్పుడు తన ఫోన్ తప్పనిసరిగా జోబులో పెట్టుకుంటానని తెలిపారు. ఈ విధంగా సెల్ ఫోన్ ఉపయోగించేటప్పుడు కొన్ని జాగ్రత్తలను పాటించడం ద్వారా ఎన్నో ప్రమాదాల నుంచి తప్పించుకోవచ్చని ఈ సందర్భంగా వీడియోను పంచుకున్నందుకు ఎరిక్సోల్హీమ్‌కు ధన్యవాదాలు. అంటూ ఆనంద్ మహీంద్రా ఓ వీడియోస్ షేర్ చేశారు.
ప్రస్తుతం ఆనంద్ మహేంద్ర షేర్ చేసిన ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ వీడియోలో ప్రమాదానికి గురైన ప్రతి ఒక్కరు తమ సెల్ ఫోన్లలో లీనమై పోవడం వల్లే ప్రమాదానికి గురవుతుంటారు. ఈ క్రమంలోనే ఈ వీడియో చూసిన నెటిజన్ స్పందిస్తూ… ఊహించని ప్రమాదం జరిగింది. ఇంస్టాగ్రామ్ లో ఈ ఫీడ్ బ్యాక్ చూడగానే వాష్ రూమ్ కి వెళ్లానని తెలుపగా.. మరికొందరు గొప్ప సందేశం తెలిపారని కామెంట్లు చేస్తున్నారు.






























