ఇప్పటి హీరోయిన్లు కేవలం సినిమాలకే పరిమితం కాకుండా సోషల్ సర్వీసులు చేస్తూ అభిమానులకు మరింత దగ్గరవుతున్నారు. వీలుంటే సహాయం చేయడం లేదంటే సదరు ఛారిటీలో పాల్గొనడం లాంటివి చేస్తున్నారు. సోషల్ సనుల్లో చురుగ్గా పాల్గొంటూ ఉండే కొంత మంది స్టార్స్ ను మనం చూశాం. బ్లూక్రాస్ సేవకురాలిగా అమల, పేటా తరపున త్రిష తమ వంతు సేవ చేస్తున్నారు.

ఇదిలా ఉండగా భకిత గురించి కొన్ని విషయాలు బయటకు వచ్చాయి. భకిత ఈ పేరు చెపితే ఎవ్వరూ గుర్తు పట్టరేమోగాని ఆనంద్ మూవీలో చైల్డ్ ఆర్టిస్ట్ అంటే మాత్రం అందరూ గుర్తు పడతారు. నటించింది ఒక చిత్రంలోనే అయినప్పటికీ తెలుగువారి గుండెల్లో నిలిచిపోయింది. ఆనంద్.. ఆనంద్ అంటూ పిలుస్తూ హీరో పక్కన తిరుగుతూ బబ్లీ రోల్‌లో అలరించింది. ఒక్క చిత్రంతోనే చైల్డ్ ఆర్టిస్ట్ గా మంచి గుర్తింపును తెచ్చుకుంది. అంతే కాదు ఆనంద్ మూవీ కి బెస్ట్ చైల్డ్ ఆర్టిస్ట్ నంది అవార్డుని సైతం దక్కించుకుంది. ఇంత వరకకు అందరికీ తెలిసిందే అయితే ఆ సినిమా తర్వాత ఆ పాపా మల్లి ఏ సినిమాలోనూ నటించలేదు అంతే కాదు ఈ సినిమా విడుదల అయ్యి 16 ఏళ్ళు దాటినా ఆమె ఇప్పుడు ఎలా ఉందొ ఎవరికీ తెలియని కూడా తెలియదు…. భకిత గురించి తెలియని విషయం ఏంతో తెలుసుకుందాం…

భకిత కి ఇప్పుడు 27 సంవత్సరాలు ఆనంద్ చిత్రంలో ఉన్న క్రేజ్‌ని ఎక్కడా వాడలేదు. తను హీరోయిన్ కావాలనుకుని కూడా ఎప్పుడూ అనుకోలేదు. అందరు చైల్డ్ ఆర్టిస్ట్ లాగా నటన పై ఆశక్తి కూడా లేదు. ఇక భవిత ఒక భిన్నమైన దారిలో నడుస్తుంది. అది మాములు దారి కాదు ముళ్ళ దారి. చదువులో చురుగ్గా ఉంది సమాజం కోసం పాటు పడుతుంది. ఉమెన్ ఈక్వాలిటీ కోసం..గర్ల్స్ రైట్స్ కోసం..ఆడవారి పైన వాయిలెన్స్ కు వ్యతిరేకంగా పోరాడుతోంది. తను 17 సంవత్సరాల నుంచే సమాజం కోసం పోరాడుతోంది. ప్రస్తుతం అమెరికాలో ఉంటున్న బకిత చదువులు పూర్తి చేసి అక్కడే సెటిల్ అయ్యింది కూడా. మరి ఈ వయసులోనే ఇలా ఉంటె ముందు ముందు ఎలాంటి గొప్ప వ్యక్తి అవుతుందో అని అంత అనుకుంటున్నారు.






























