ఎంతో రసవత్తరంగా కొనసాగుతున్న కార్తీకదీపం సీరియల్ నేడు 1099 వ ఎపిసోడ్ లోకి ఎంటర్ అయింది.గత ఎపిసోడ్ లో కార్తీక్ భోజనం చేస్తుండగా మోనిత ఫోన్ చేసి మీ నాన్న రిజిస్టర్ ఆఫీస్ వద్దకు రమ్మన్నారు అంటూ ఫోన్ కట్ చేస్తుంది. దీంతో గర్భవతి అన్న విషయం నాన్నకు తెలీదు మోనిత చెపుతుందేమో అని కార్తీక,దీప కంగారు పడి రిజిస్టర్ ఆఫీస్ కు బయలుదేరుతారు.రిజిస్టర్ ఆఫీస్ లో మోనిత పెళ్లి కోసం అప్లై చేసిన అప్లికేషన్ చూసి ఎంతో కోపంతో ఉన్న ఆనందరావు దగ్గరికి వెళ్లి నమస్తే మామయ్య.. అంటూ పలకరించింది. అంకుల్ ను మామయ్య అన్నంత మాత్రాన కొడుకు స్నేహితురాలు కోడలు కాదు.. నరం లేని నాలుక ఏమన్నా అది కరెక్ట్ కాదని గట్టిగా సమాధానం చెప్పాడు.

ఆనంద్ రావు మాట్లాడిన మాటలకు మోనిత స్పందిస్తూ.. నాలాంటి గొప్ప డాక్టర్ మీ ఇంటికి కోడలుగా వస్తే మీ గౌరవ ప్రతిష్టలు పెరుగుతాయి అంటుంది. అనైతికంగా వచ్చే గౌరవ ప్రతిష్టలు నాకు అవసరం లేదంటూ ఆనందరావు సమాధానం చెబుతారు. నేను మీ సహాయం కోరలేదు.. మీకు సమాచారం ఇవ్వలేదు సౌందర్య పెళ్ళి విషయంలో నిస్సహాయత వ్యక్తం చేస్తూ అమెరికా వెళ్ళి పోయారు అంటూ చెబుతుంది. మోనిత మాటలకు కోపంతో రగిలి పోతున్న ఆనందరావు ఇద్దరూ కలిసి పార్టనర్ గా హాస్పిటల్ పెట్టుకుంటాం అంటే ఓకే అన్న కానీ.. నా కొడుకు జీవితంలోకి పార్ట్నర్ గా వస్తానంటే ఒప్పుకోం అని గట్టిగా సమాధానం చెబుతాడు.
నేను కార్తీక్ 16 సంవత్సరాల నుంచి ప్రేమించుకుంటున్నాం… అని చెప్పగా నా కొడుకుని ఎందుకు ప్రేమించావ్ అని అడగను.. పెళ్లి అయిన వ్యక్తిని ఎందుకు ప్రేమించావని సమాజం అడుగుతుంది నీతిమాలిన చర్య అంటూ వారి పెళ్లికి అభ్యంతరం వ్యక్తం చేశాడు. ఈ క్రమంలోనే కార్తిక్ తో పెళ్లికి క్యాన్సిల్ చేసుకో అని ఆనందరావు చెప్పగా..నా దిగజారిన పరిస్థితి మీతో చెప్పలేను 25వ తేదీ పెళ్లి జరగకపోతే మీ పేరు ప్రతిష్టలు రోడ్డున పడతాయి అయినా అసలు విషయం మీకు తెలియనట్టు ఉంది. మీ అబ్బాయి వల్ల నేను గర్భవతిని అయ్యాను.. త్వరలోనే మీ ఇంటికి వారసుడు రాబోతున్నాడు.. మీరు తాత కాబోతున్నారు అంటూ బాంబు పేలుళ్లు స్తుంది.
ఈ విషయం విన్న ఆనందరావు ఒక్కసారిగా షాక్ అవ్వడంతో గుండెపోటు వస్తుంది. అక్కడే ఉన్న కార్తీక్ దీప వెంటనే వెళ్లి ఆనందరావు పట్టుకోగా దాంతో నన్ను ముట్టుకోవద్దు అని అరుస్తూ కుప్పకూలి పోతే అతనిని ఆసుపత్రికి తీసుకెళ్ళి చికిత్స చేస్తాడు. కార్తీక్ చేత చికిత్స చేయించుకోవడానికి అభ్యంతరం వ్యక్తం చేస్తాడు. ముందు అక్కడి నుంచి వెళ్లిపోవాలని ఆనందరావు గట్టిగా చెప్పడంతో కార్తీక్ డాక్టర్ గోవర్ధన్ ను పిలవండి అని చెప్పి అక్కడి నుంచి బయటకు వెళ్ళిపోతాడు. ఆ తర్వాత ఏం జరుగుతుందనే విషయాన్ని తర్వాత ఏం జరుగుతుందో తెలియాలంటే తరువాత ఎపిసోడ్ వరకు వేచి ఉండాల్సిందే.




























