Anantha Sriram: తెలుగు చిత్ర పరిశ్రమలో పాటల రచయితగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న వారిలో ప్రముఖ రచయిత అనంత శ్రీరామ్ ఒకరు. పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లు దగ్గర దొడ్డిపట్ల గ్రామానికి చెందిన ఈయన ఇండస్ట్రీలోకి వచ్చి ఎన్నో అద్భుతమైన పాటలను రచించారు.

అనంత శ్రీరామ్ ఇప్పటివరకు సుమారు 500 కు పైగా పాటలను రాశారు. అందులో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నవి ఎన్నో ఉన్నాయి. ఇక ఈయన ఎన్నో సింగింగ్ కాంపిటీషన్ కార్యక్రమాలకు వ్యాఖ్యాతగా కూడా వ్యవహరించారు.ఏ విషయాన్ని అయినా ఎంతో స్పష్టంగా అర్థవంతంగా మాట్లాడే అనంత శ్రీరామ్ గత కొంతకాలంగా పలు వివాదాలను కూడా ఎదుర్కొంటున్నారు.
ముఖ్యంగా మెగాస్టార్ గరికపాటి విషయంలో కూడా ఈయన స్పందించి చేసిన కామెంట్స్ గతంలో వైరల్ అయ్యాయి. అయితే తాజాగా ఈయనపై పోలీస్ కేసు నమోదు కావడం గమనార్హం. అయితే అనంత శ్రీరామ్ పై పోలీస్ కేసు నమోదు కావడానికి గల కారణం ఏంటి అనే విషయానికి వస్తే…సంక్రాంతి పండుగ సందర్భంగా పాలకొల్లులో జరిగిన సంక్రాంతి సంబరాల్లో పాల్గొన్న అనంత శ్రీరామ్ మాట్లాడుతూ.. భట్రాజు పొగడ్తలు అన్నారట.

Anantha Sriram: భట్రాజు కులస్తులను కించపరిచిన అనంత శ్రీరామ్…
ఈయన భట్రాజు పొగడ్తలు అనడంతో ఈ మాటలపై భట్రాజు కులస్తులు తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేయడమే కాకుండా మా మనోభావాలు దెబ్బతీసేలా అనంత శ్రీరామ్ మాట్లాడారని, ఈయన మాట్లాడిన మాటలకు సంబంధించిన వీడియోని జత చేస్తూ ఈయనపై ఎస్పీకి ఫిర్యాదు చేశారట. భట్రాజు పొగడ్తలు అనే పదాన్ని ప్రభుత్వం ఎప్పుడో నిషేధించింది అయినప్పటికీ ఈయన వ్యాఖ్యలు చేస్తూ తమను కించపరిచారు అంటూ పోలీసులకు ఈ కులస్తులు ఫిర్యాదు చేశారు.































