Anasuya: అనసూయ భరద్వాజ్ పరిచయం అవసరం లేని పేరు. బుల్లితెర యాంకర్ గా ఎంతో మంచి సక్సెస్ అయినటువంటి ఈమె అనంతరం వెండితెర సినిమా అవకాశాలను అందుకొని ప్రస్తుతం కెరియర్ పరంగా బిజీ అయ్యారు. ఇక త్వరలోనే అనసూయ నటించిన పుష్ప 2 సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఈ సినిమాలో ఈమె దాక్షాయని అని నెగిటివ్ పాత్రలో కనిపించబోతున్న సంగతి తెలిసిందే.

ఇలా సినిమాతో పాటు మరికొన్ని సినిమాలలో నటిస్తూ ఈమె కెరియర్ పరంగా బిజీ అయ్యారు. ఇదిలా ఉండగా తాజాగా అనసూయ ఇటీవల తన పుట్టినరోజు వేడుకలను జరుపుకున్న సంగతి తెలిసిందే. అయితే తన భర్త పిల్లలతో కలిసి ప్రస్తుతం వెకేషన్ లో ఉన్నటువంటి ఈమె అడవుల బాట పడుతూ ఎంతో ఎంజాయ్ చేస్తున్నారు.
బర్త్ డే సెలబ్రేషన్స్..
ఇక అనసూయ తన పుట్టినరోజు వేడుకలను కూడా తన ఫ్యామిలీతో కలిసి జరుపుకున్నారు. సరదాగా కేక్ కట్ చేస్తూ తన ఫ్యామిలీతో ఈమె చిల్ అవుతూ కనిపించారు. ప్రస్తుతం అనసూయ తన వెకేషన్ కి సంబంధించిన ఫోటోలను ఎప్పటికప్పుడు సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకుంటున్నారు.
ఇక అనసూయ పుట్టినరోజు సందర్భంగా పుష్ప 2 నుంచి ఈమెకు సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల చేశారు. ఇక ఈమె పుట్టినరోజు సందర్భంగా ఎంతో మంది అభిమానులు ఇతర సెలబ్రిటీలు అనసూయకు సోషల్ మీడియా వేదికగా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.



























