బుల్లితెర యాంకర్ గా కొనసాగుతున్న అనసూయకి పలు సినిమా అవకాశాలు రావడంతో వెండితెరపై సందడి చేశారు. ఈ క్రమంలోనే ఈమెకు సినిమా అవకాశాలు రావడంతో వెండితెరపై కూడా ఎంతో బిజీగా ఉన్నారు. ముఖ్యంగా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన “రంగస్థలం” సినిమాలో రంగమ్మత్త పాత్ర ద్వారా ఎనలేని గుర్తింపును సంపాదించుకున్న అనసూయ ఆ తర్వాత వరుస సినిమా అవకాశాలను దక్కించుకుంది.

తాజాగా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న పుష్ప సినిమాలో కూడా ఈ యాంకరమ్మ సందడి చేయనున్నారు. ఈ క్రమంలోనే ఈ సినిమాలో అనసూయ ఏ పాత్రలో నటిస్తుంది. తన లుక్ ఏ విధంగా ఉంది అనే విషయానికి సంబంధించిన ఫోటో లీక్ అవడంతో ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కుతున్న “పుష్ప” సినిమాలో అనసూయ నెగిటివ్ పాత్రలో కనిపించనున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే సునీల్ భార్యగా డీ గ్లామర్ పాత్రలో అనసూయ నటిస్తున్నట్లు తెలుస్తుంది.
ఈ క్రమంలోనే ఈ సినిమా నుంచి లీకైన అనసూయ లుక్ కి సంబంధించిన ఫోటో ప్రస్తుతం వైరల్ గా మారింది. ఈ ఫోటోలో అనసూయ పొట్టి జుట్టుతో, నుదుటిన పెద్ద బొట్టు పెట్టుకుని కనిపిస్తున్నారు. ప్రస్తుతం అనసూయకు సంబంధించిన ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.ఇకపోతే పుష్ప సినిమా మొదటి పార్ట్ క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 25న విడుదల చేయనున్నట్లు చిత్ర బృందం అధికారికంగా ప్రకటించారు.































