Anasuya: జబర్దస్త్ యాంకర్ గా బుల్లితెరపై ఎంతో మంచి క్రేజ్ సొంతం చేసుకున్న అనసూయ వెండితెర రంగమ్మత్తగా అదే స్థాయిలో ఆదరణ అందుకున్నారు. ఇలా వెండితెరపై ప్రస్తుతం వరుస సినిమాలతో ఎంతో బిజీగా గడుపుతున్న ఈమె సోషల్ మీడియాలో కూడా యాక్టివ్ గా ఉంటూ తనకు సంబంధించిన విషయాలను అభిమానులతో పంచుకుంటారు.

తాజాగా రంగ మార్తాండ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చిన అనసూయ ప్రస్తుతం వరుస ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు. ఇకపోతే తాజాగా సోషల్ మీడియా వేదికగా అభిమానులతో ఈమె సరదాగా ముచ్చటించారు. ఈ క్రమంలోనే అభిమానులు అడిగిన ప్రశ్నలకు అనసూయ తనదైన స్టైల్ లో సమాధానం ఇచ్చారు.
ఈ క్రమంలోనే కొందరు పుష్ప 2 సినిమా గురించి అప్డేట్ ఇవ్వమని అడగగా తాను ఇంకా షూటింగ్ లోకేషన్ లోకి అడుగు పెట్టలేదని సమాధానం చెప్పారు.మరొక నేటిజన్ ప్రశ్నిస్తూ అభిమానులు అడిగితే మీరు ఎందుకు వారితో కలిసి ఫోటోలు దిగరు వారి వల్లే కదా మీరు ఈ స్థాయిలో ఉన్నారు అంటూ ప్రశ్నించారు. ఈ ప్రశ్నకు అనసూయ తనదైన స్టైల్ లో సమాధానం చెప్పారు.

Anasuya: చాలామందితో ఫోటోలు దిగాను…
మనుషులన్న తర్వాత కొన్ని మూడ్స్ ఉంటాయి. సెలబ్రిటీలైనంత మాత్రాన మేము మనుషులం కాదనుకుంటే ఎలా?నేను చాలామందితో ఫోటోలు దిగాను మీతో దిగలేదని ఇలా జడ్జ్ చేయడం ఎంతవరకు కరెక్ట్ అంటూ ఈ సందర్భంగా ఈమె సమాధానం చెప్పారు. ఇలా అనసూయ చేసినటువంటి ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.































