ప్రపంచాన్ని కరోనా వైరస్ దడ దడ లాడిస్తుంటే..అనసూయ కి ఏమైంది ఇలా మాట్లాడుతుంది అనుకుంటున్నారా ? జబర్డస్ట్ హాట్ యాంకర్ అనసూయ నిత్యం సోషల్ మీడియాలో అభిమానులకు అందుబాటులో ఉంటుంది. ఎప్పుడు ఎదో ఒక పోస్టులతో తన మనోభావాలను అభిమానానులతో పంచుకుంటుంది. అయితే తాజాగా అనసూయ కరోనా వైరస్ గురించి పెట్టిన పోస్టు ఆసక్తికరంగా మారింది.

ప్రపంచం మొత్తం కరోనా వైరస్ దెబ్బకు వణిపోతున్నారు. ఇప్పుడు ఇండియాలో కూడా కరోనా ప్రవేశించింది సుమారు 28 కేసులు నమోదయ్యాయనేది కేంద్ర సమాచారం. మరీ ముఖ్యంగా తెలంగాణాలో ఇప్పుడిప్పుడే కరోనా ప్రవేశిస్తుంది. కరోనా దెబ్బకు కొందరు పబ్లిక్ ప్రదేశాలలో తిరగడం మానేశారు. మరికొందరు ఆఫిసులకు సెలవులు పెట్టి ఊరికి వెళ్లిపోయారు.

Just trying to see some brighter side.. So all this paranoia about the virus is giving us all the chanceto spend some quality time with family.. just watched #EndGame again and dear @Marvel .. please.. there has to be a way to get #IronMan back ????????
— Anasuya Bharadwaj (@anusuyakhasba) March 5, 2020
తాజాగా యాంకర్స్ కూడా ప్రోగ్రామ్స్ కు కొద్దిరోజులు బ్రేక్ ఇచ్చారట. దేనితో ఫ్రీ టైం దొరికిందని తెగ సంబరపడిపోతుంది అనసూయ. ప్రస్తుతం ట్విట్టర్ లో ఇదే పోస్ట్ చేసింది. కరోనా కారణంగా చాలా రోజుల తరువాత ఇంట్లో మంచి సమయాన్ని గడుపుతున్నాని చెబుతుంది అనసూయ. తన పిల్లలతో కలిసి హాయిగా గడుపుతున్నాని, ఇప్పుడే అవెంజర్స్ ఎండ్ గేమ్ చిత్రాన్ని చూశానని ట్విట్టర్ లో పోస్ట్ చేసింది. కరోనా తనకు ఈ రకంగా మేలు చేసిందని భావిస్తోంది ఈ ముద్దుగుమ్మ.

































