Anasuya: వెండితెర రంగమ్మత్తగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న అనసూయ ప్రస్తుతం వరుస సినిమాలలో నటిస్తూ ఎంతో బిజీగా ఉన్నారు. ఇలా పలు సినిమాల ద్వారా ఎంతో బిజీగా గడుపుతున్నటువంటి ఈమె ప్రస్తుతం బుల్లితెర కార్యక్రమాలకు దూరంగా ఉంటూ కేవలం వెండి తెర సినిమాలలో మాత్రమే నటిస్తున్నారు.

ఇక సినిమా పనులలో ఎంతో బిజీగా ఉండే అనసూయ ఇండస్ట్రీలో పలు సినిమాలకు సంబంధించిన విషయాలు గురించి కూడా సోషల్ మీడియా వేదికగా ప్రస్తావిస్తూ ఉంటారు. ఈ క్రమంలోనే కొన్నిసార్లు వివాదాలు కూడా తలెత్తుతూ ఉంటాయి.ఈ క్రమంలోనే అనసూయ తాజాగా విజయ్ దేవరకొండ తమ్ముడు ఆనంద్ దేవరకొండ నటించిన బేబీ సినిమా ట్రైలర్ పై స్పందిస్తూ చేసినటువంటి కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.
ఈ సందర్భంగా అనసూయ బేబీ సినిమా ట్రైలర్ గురించి సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ.. మీ సెలబ్రేషన్స్ లో చాలా ఆలస్యంగా జాయిన్ అయ్యాను. సాయి రాజేష్ ను చూస్తుంటే చాలా గర్వంగా ఉంది. ట్రైలర్ చాలా అద్భుతంగా ఉంది ఒరిజినాలిటీ గుండెలను హత్తుకునేలా మాటలు చూస్తుంటే ఈ సినిమా కథ నాకు తెలిసిన వాళ్ళ కథలాగే ఉందని తెలిపారు.

Anasuya పాజిటివ్ కామెంట్స్ చేసిన అనసూయ…
ఇలాంటి ఒక గొప్ప సినిమాను చూడటం కోసం చాలా ఆత్రుతగా ఎదురుచూస్తున్నాను. ఆనంద్ చాలా ఇంటెన్స్ గా నటించారు.నిర్మాతకు కూడా ఈమె అభినందనలు తెలిపారు. ఇలా చిత్ర బృందానికి నా అభినందనలు అంటూ అనసూయ చేసినటువంటి ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. అయితే విజయ్ దేవరకొండపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేసే అనసూయ తన తమ్ముడు ఆనంద దేవరకొండ సినిమా పట్ల ఇలాంటి పాజిటివ్ కామెంట్ చేయడంతో అందరూ ఆశ్చర్యపోతున్నారు.
































