Anasuya: అనసూయ ఈమధ్య కాలంలో కాస్త వివాదాలను తగ్గించింది అనుకోనే లోపు మరో వివాదానికి తెర లేపారు. అనసూయ జబర్దస్త్ యాంకర్ గా కొనసాగుతున్న సమయం నుంచి భారీ స్థాయిలో ట్రోల్స్ ఎదుర్కొంటూ నేటిజన్ల విమర్శలకు కారణమవుతున్నారు. ఇలా తరచూ ఏదో ఒక విషయం ద్వారా ఈమె సోషల్ మీడియా వేదికగా వివాదానికి కారణం అవుతూ ఉండేవారు.

ఇలా పలు వివాదాల ద్వారా వార్తలలో నిలిచినటువంటి అనసూయ విజయ్ దేవరకొండతో ఏర్పడినటువంటి వివాదం ద్వారా సంచలనంగా మారారు. అయితే విజయ్ ఫ్యాన్స్ అదే స్థాయిలో ఈమెను ట్రోల్ చేయడం మొదలుపెట్టారు. దీంతో విసిగిపోయిన ఈమె తాను ఈ వివాదానికి ముగింపు పలుకుతున్నానని తెలియజేశారు. ఇలా విజయ్ వివాదానికి చెక్ పెట్టినటువంటి ఈమె అనంతరం సోషల్ మీడియాలో వచ్చే ట్రోల్స్ పెద్దగా పట్టించుకోలేదు.
ఇకపోతే తాజాగా మరోసారి ట్విట్టర్ వేదికగా ఈమె చేసినటువంటి ట్వీట్ కనక చూస్తే అనసూయ మరో వివాదానికి తెర లేపారు. అందుకే ఇలాంటి పోస్ట్ చేశారని పలువురు భావిస్తున్నారు.ఇంతకీ అనసూయ ట్విట్టర్ వేదికగా ఎవరిని ఉద్దేశించి ఎలాంటి పోస్ట్ చేశారనే విషయానికి వస్తే… ఈమె చేసినటువంటి ఈ ట్వీట్ లో ఎక్కడా కూడాఎవరి పేరు ప్రస్తావించలేదు కానీ ఈమె చేసిన ట్వీట్ మాత్రం వివాదానికి కారణం అవుతుందని తెలుస్తుంది.

Anasuya: నా పేరు లేకుండా ఏది చెప్పలేకపోతున్నారు..
ఈ సందర్భంగా ట్విట్టర్ వేదికగా స్పందించిన అనసూయ.. వావ్ నేను వాళ్లకు చాలా ముఖ్యం నా ప్రమేయం ఉన్నా లేకున్నా..నాకు సంబంధం ఉన్న లేకపోయినా నా పేరును ఉపయోగిస్తూ ఉంటారు. నా పేరు లేకుండా ఏమాత్రం డిస్కషన్ జరగవు నాపై అంతగా డిపెండ్ అయి ఉన్నారు.పాపం నా పేరు లేకుండా ఏది చెప్పలేకపోతున్నారు అంటూ ఈమె చేసినటువంటి ఈ ట్వీట్ చూసిన నెటిజెన్స్ మళ్లీ మిమ్మల్ని ఎవరు ఏమి అన్నారు అంటూ కామెంట్ చేస్తున్నారు.