Anasuya: టాలీవుడ్ ఇండస్ట్రీలో బుల్లితెర యాంకర్ గా ఎంతో మంచి సక్సెస్ అందుకున్న అనసూయ ప్రస్తుతం వెండితెరపై ఎంతో బిజీగా గడుపుతున్నారు. ఇలా బుల్లితెర కార్యక్రమాలకు దూరంగా ఉంటున్న ఈమె వరస సినిమాలలో నటిస్తూ బిజీగా ఉన్నారు. త్వరలోనే అనసూయ నటించిన పుష్ప 2 సినిమా విడుదల కానుంది ఈ క్రమంలోనే ఈమె సోషల్ మీడియా వేదికగా చేసిన పోస్టు సంచలనగా మారింది.

తాజగా హైదరాబాద్లో జరిగిన ఈ సినిమా వేడుకలో ఎంతో సరదాగా యాక్టివ్గా అనసూయ కనిపించారు. ఈ కార్యక్రమంలో ఈమె రష్మిక తో పాటు ఇతర సినిమా బృందంతో చాలా సంతోషంగా గడిపారు. అయితే ఈ వేడుక పూర్తి కాగానే అనసూయ సోషల్ మీడియా వేదికగా చేసిన పోస్ట్ సంచలనగా మారింది.
ఈమె సోషల్ మీడియా వేదికగా దూరపు కొండలు నునుపు అనే ఒక్క పోస్ట్ మాత్రమే చేసింది. అయితే ఈ పోస్ట్ మాత్రం సోషల్ మీడియాలో సంచలనగా మారడమే కాకుండా మరోసారి విజయ్ దేవరకొండ అభిమానులకు అనసూయకు మధ్య వివాదాన్ని రాజేచేసింది. ఇలా అనసూయ దూరపు కొండలు అనే పదంలో కొండలు అనే పదాన్ని మాత్రమే అభిమానులు గుర్తిస్తూ తప్పకుండా ఈ కౌంటర్ విజయ్ దేవరకొండను ఉద్దేశించి చేశారు అంటూ కామెంట్లు చేస్తున్నారు.

Anasuya: విజయ్ దేవరకొండ..
ఇక మరి కొంతమంది అభిమానులైతే రష్మికని ఉద్దేశించి ఈ పోస్ట్ చేశారని భావిస్తున్నారు. కన్నడ ఇండస్ట్రీ నుంచి హీరోయిన్గా సక్సెస్ అయిన రష్మిక ఇలా విజయ్ దేవరకొండను ప్రేమిస్తున్న నేపథ్యంలో దూరపు కొండలు నునుపు అనే ఉద్దేశంతోనే ఈమె ఈ పోస్ట్ చేశారని భావిస్తున్నారు. ఏది ఏమైనా ఒక్క పోస్టుతో రష్మిక మరోసారి వార్తల్లో ట్రెండ్ అవుతున్నారు.



























