Anasuya: అనసూయ భరద్వాజ్ సోషల్ మీడియాలో అయినా లేదా మీడియా సమావేశంలోనైనా పాల్గొన్నారంటే ట్రోలర్స్ కి కావలసినంత స్టఫ్ దొరుకుతుందని చెప్పాలి. ఈమె సోషల్ మీడియా వేదికగా లేకపోతే ఏ కార్యక్రమంలో పాల్గొన్న తనకు తోచినది మాట్లాడుతూ ఉంటారు. తద్వారా ఎన్నో రకాల ట్రోల్స్ ఎదుర్కొంటూ ఉంటారు.

అనసూయ గతంలో ఎన్నోసార్లు పెద్ద ఎత్తున వివాదాలలో నిలిచిన సంగతి తెలిసిందే. ఏకంగా ఈమె తనపై వస్తున్నటువంటి ట్రోల్స్ భరించలేక సైబర్ క్రైమ్ పోలీసులకు కూడా కంప్లైంట్ చేశారు. ఇలా తన పట్ల ఎన్ని ట్రోల్స్ వచ్చినా తగ్గేదే లేదంటూ ఈమె యధావిధిగా తనకు తోచిన విషయాలను అభిమానులతో పంచుకుంటున్నారు.
ముఖ్యంగా విజయ్ దేవరకొండతో వివాదం తారాస్థాయికి చేరిన సంగతి తెలిసిందే అయితే గత కొద్ది రోజులుగా ఇలాంటి వివాదాలకు దూరంగా ఉన్న ఈమె ఇటీవల సింబా ట్రైలర్ లాంచ్ కార్యక్రమంలో భాగంగా మరోసారి విజయ్ దేవరకొండ ప్రస్తావనకు తీసుకువచ్చి వార్తల్లో నిలిచారు. తాజాగా ఈ సినిమా ప్రీ రిలీజ్ వేడుక కూడా జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా అనసూయ సినీ కెరియర్ కి సంబంధించి స్పెషల్ ఏవి విడుదల చేశారు.
ఇక ఈ వీడియో చూసిన తర్వాత అనసూయ నా కెరియర్ లో నేను ఇన్ని సినిమాలు చేశాను అంటే నాకే ఆశ్చర్యం వేస్తుంది అయితే ఇదంతా కూడా అభిమానుల వల్లే సాధ్యమైందని తెలిపారు. ఇక ఈ సినిమా గురించి మాట్లాడుతూ ఎన్నో విషయాలు వెల్లడించారు. అలాగే ఈ సినిమాలో పనిచేసిన టెక్నీషియన్ల గురించి అనసూయ మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
ఏజ్ అయిపోతుంది…
ఇలా టెక్నీషియన్ల గురించి మాట్లాడుతూ కొందరి పేర్లు మర్చిపోయాను. నాకు స్టార్ట్ టర్మ్ మెమొరీ లాస్ వచ్చిందని తెలిపారు.తనకు ఏజ్ అయిపోతుందేమో, అందుకే ఇలా మెమొరీ లాస్ వస్తుందని చెప్పి పెద్ద షాకిచ్చింది. సోషల్ మీడియాకి మంచి స్టఫ్ వదిలింది. ఎప్పుడు ఏజ్ గురించి మాట్లాడడానికి ఈమె తాజా కార్యక్రమంలో తనకు ఏది అయిపోతుంది అంటూ కామెంట్లు చేయడంతో ఇది కాస్త వైరల్ అవుతుంది.



























