Anasuya: సినీ ఇండస్ట్రీలో పవన్ కళ్యాణ్ కు ఉన్నటువంటి క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇండస్ట్రీలో స్టార్ హీరోగా ఎంతో మంచి సక్సెస్ అందుకున్న పవన్ కళ్యాణ్ ప్రస్తుతం రాజకీయాలలో కూడా ఎంతో బిజీగా గడుపుతున్నారు. పవన్ కళ్యాణ్ పేరు వినిపిస్తే చాలు అభిమానులకు పూనకాలు వచ్చేస్తాయి అంత క్రేజ్ ఈయన సొంతం చేసుకున్నారు.

ఇక ఇటీవల రాజకీయాలలో పవన్ కళ్యాణ్ ఎంతో బిజీగా ఉన్న నేపథ్యంలో సినిమాలను కాస్త తగ్గించారని చెప్పాలి. అయితే ఈయన తనకు వీలైనప్పుడల్లా సినిమా షూటింగ్ పనులలో పాల్గొంటూ ఉన్నారు. ఇలాంటి క్రేజ్ ఉన్నటువంటి ఒక హీరో సినిమాలో చిన్న ఛాన్స్ వచ్చిన నటించడం కోసం ఎంతో మంది ఆసక్తి చూపుతూ ఉంటారు అలాంటిది పిలిచి మరి ఈయన సినిమాలో అవకాశం కల్పిస్తే ఒక నటి రిజెక్ట్ చేశారని తెలుస్తోంది.
మరి పవన్ కళ్యాణ్ సినిమాలో నటించడానికి ఆసక్తి చూపనటువంటి ఆమె ఎవరు అనే విషయాన్ని వస్తే ఆమె మరెవరు కాదు నటి అనసూయ అని చెప్పాలి. అనసూయ ప్రస్తుతం వరుస సినిమాలలో నటిస్తూ కెరియర్ పరంగా ఎంతో బిజీగా ఉన్నారు. అయితే ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నటువంటి అనసూయ ఈ విషయాన్ని బయట పెట్టారు పవన్ కళ్యాణ్ తో సినిమాలో నటించే అవకాశం వచ్చిన ఎందుకు రిజెక్ట్ చేశారు అంటూ యాంకర్ ప్రశ్నించారు.
ఈ ప్రశ్నకు అనసూయ సమాధానం చెబుతూ.. పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన అత్తారింటికి దారేది సినిమాలో వచ్చే పబ్ సాంగ్లో నటించమని నన్ను అడిగారు అయితే అలా గ్రూప్ సాంగ్లో నటించడానికి నాకు ఇష్టం లేకపోవడంతో రిజెక్ట్ చేసనని, ఆ సమయంలో నాకు బలుపు ఈగో అంటూ చాలామంది విమర్శించారు.
నిజానికి నేను ఆ పాటను రిజెక్ట్ చేయడానికి కారణం లేకపోలేదని తెలిపారు ఆ సమయంలో నా ఆలోచనలు చాలా భిన్నంగా ఉండేవి నేను ఏదైనా ఒకసారి ఆలోచిస్తే అదే నిజమని భావించేదాన్ని ఇతరులు చెప్పిన పట్టించుకొనే దాన్ని కాదు. కానీ ఇప్పుడు చాలా ఉన్నతంగా ఆలోచిస్తున్నానని అందుకే పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తున్న హరిహర వీరమల్లు సినిమాలో ఆయనతో కలిసి ఓ సాంగ్ చేయబోతున్నాను అంటూ అనసూయ చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.
































