Anasuya: బుల్లితెర యాంకర్ గా ఎంతో మంచి సక్సెస్ అందుకున్న అనసూయ ప్రస్తుతం వరుస సినిమాలలో నటిస్తూ కెరియర్ పరంగా ఎంతో బిజీగా ఉన్నారు. జబర్దస్త్ కార్యక్రమానికి యాంకర్ గా వ్యవహరించిన ఈమె ఈ కార్యక్రమం ద్వారా ఎంతో ఫేమస్ అయ్యారు. తద్వారా సినిమా అవకాశాలను అందుకుంటూ కెరియర్ పరంగా బిజీగా మారిపోయారు.

ప్రస్తుతం వరుస సినిమాలలో నటిస్తున్నటువంటి ఈమె బుల్లితెరకు ఇన్ని రోజులు దూరం ఉన్నప్పటికీ త్వరలోనే మరో సరికొత్త గేమ్ షో ద్వారా బుల్లితెరపై సందడి చేయబోతున్నారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ప్రోమోలో కూడా వైరల్ అవుతున్నాయి. అయితే ఇటీవల విడుదల చేసిన ప్రోమోలో అనసూయ శేఖర్ మాస్టర్ తో పోటీపడుతూ జాకెట్ విప్పేసి రచ్చ చేశారు. దీంతో పెద్ద ఎత్తున ట్రోల్స్ ఎదుర్కొంటున్నారు.
ఈ క్రమంలోనే ఒక నెటిజన్ ఈ విషయంపై కామెంట్ చేస్తూ..ఇది నిజంగా నాన్ సెన్స్.. ఏమన్నా అంటే అనసూయ విక్టిమ్ కార్డు ప్లే చేస్తుందని పోస్ట్ పెట్టాడు. అనసూయ స్పందించింది. మీరు పెట్టిన ఎమోజిలు, మీ మైండ్ సెట్ చూస్తుంటే.. ఎందుకు మీరు ఇంత రోగంతో భాదపడుతున్నారని అనిపిస్తోంది అంటూ కౌంటర్ ఇచ్చింది.
కొన్ని మార్పులు తప్పవు..
మీరంటే నాకు చాలా ఇష్టం మీకు నిజంగా అర్థం కావట్లేదా అండి.. ఎలా ఉండే షోలు ఎలా అవుతున్నాయి. మీ పాత్ర మంచిగా ఉండాలి కానీ బ్యాడ్ వైపు వెళ్ళకూడదనీ మరొక నెటిజన్ కామెంట్ చేయగా అనసూయ స్పందిస్తూ.. మేము సినిమా ఇండస్ట్రీలో ఉండే వాళ్ళం మేము కొన్ని విషయాలని ఎక్స్ ప్లోర్ చేయాలి. ఆడియన్స్ అభిరుచికి తగ్గట్లుగా కొన్ని మార్పులు తప్పవు. మీరంతా బుల్లితెరపై మాత్రమే తప్పులను కనిపెడతారు కానీ సినిమాలలో ఇలాంటి సన్నివేశాలు వస్తే హిట్ చేస్తారు అంటూ తనదైన శైలిలోనే ఈమె సమాధానం ఇచ్చారు.



























