Anchor Anasuya: అనసూయ భరద్వాజ్ ఈ పేరు గురించి చెప్పాల్సిన పనిలేదు. ఇండస్ట్రీలో యాంకర్ గా తన కెరియర్ ప్రారంభించి అనంతరం సినిమాలలో నటిస్తూ ఎంతో బిజీగా ఉన్నారు. ఇలా ఇండస్ట్రీలో వరుస సినిమా అవకాశాలను అందుకుంటున్న అనసూయ పూర్తిగా బుల్లితెర కార్యక్రమాలకు గుడ్ బై చెప్పారు. వరుస సినిమా షూటింగ్ లతో ఎంతో బిజీగా ఉన్న అనసూయ గత కొన్ని రోజుల నుంచి అమెరికాలో ఉంటున్న విషయం మనకు తెలిసిందే.

ఈ క్రమంలోనే అమెరికా వీధులలో చక్కర్లు కొడుతూ ఫోటోలు దిగడం ఆ ఫోటోలను ఎప్పటికప్పుడు సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకోవడం చేస్తున్నారు.ఈ క్రమంలోనే అనసూయ దీపావళి పండుగను కూడా తన కుటుంబానికి దూరంగా ఉండి అమెరికాలో తన స్నేహితులతో కలిసి సెలబ్రేట్ చేసుకున్నారు.ఇకపోతే అనసూయ తాజాగా సోషల్ మీడియా వేదికగా ఒక వ్యక్తితో కలిసి దిగిన ఫోటోని షేర్ చేశారు.
ఈ క్రమంలోనే అనసూయతో కలిసి ఫోటో దిగిన ఆ వ్యక్తి ఎవరు అనసూయతో అంత క్లోజ్ గా ఉండడంతో అతనికి అనసూయ ఏమవుతుంది అనే విషయం గురించి పెద్ద ఎత్తున నేటిజన్లు ఆరాతీస్తున్నారు. ఈ క్రమంలోనే అనసూయ ఆ వ్యక్తితో ఫోటో దిగడమే కాకుండా అతనిని ఉద్దేశిస్తూ నా సంరక్షకుడు.. స్నేహితుడు నేను జెర్రీ అయితే అతను టామ్.హ్యాపీ బర్త్డే అంటూ తనకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేయడమే కాకుండా తన పేరు ఉజ్వల్ అని చెప్పుకొచ్చారు.

Anchor Anasuya: హీరోగా నటించిన ఉజ్వల్..
ఇక ఈయన కూడా సినీ పరిశ్రమకు చెందిన వారే. ఉజ్వల్ అడవి శేషు దర్శకత్వంలో తెరకెక్కిన కిస్ అనే సినిమాలో హీరోగా నటించారు. అయితే ఈ సినిమా షూటింగ్ పూర్తి అయినప్పటికీ విడుదలకు నోచుకోలేదు. ఇలా ఒక సినిమాలో హీరోగా నటించిన ఉజ్వల్ మరే ఇతర సినిమాలలోను నటించలేదు. అయితే ప్రస్తుతం ఆయన అమెరికాలో నివసిస్తున్నారు. ఇలా తన స్నేహితుడు అని అనసూయ చెప్పడంతో వీరిద్దరి మధ్య పరిచయం ఎలా ఏర్పడిందనే విషయం గురించి ఆరా తీస్తున్నారు. ప్రస్తుతం అనసూయ షేర్ చేసిన ఈ ఫోటో వైరల్ గా మారింది.































