Anchor Anitha Chowdary : తొంభైల్లో యాంకర్ గా అన్ని ఛానెల్స్ లో పనిచేసి పాపులర్ అయిన అనిత చౌదరి ఈటీవీ లో యాంకర్ గా ఎన్నో ప్రోగ్రామ్స్ చేసారు. ఆ తరువాత మంజుల నాయుడు గారి సీరియల్ ‘కస్తూరి’తో మంచి గుర్తింపు తెచ్చుకుని ఆ తరువాత వరుసగా ఋతు రాగాలు, నాన్న అంటూ సీరియల్స్ చేసి తెలుగు ప్రేక్షకులకు దగ్గరైంది. సినిమాల్లోను నటించిన అనిత చౌదరి మొదట హీరోయిన్ గా శ్రీకాంత్ తాళి సినిమాలో అవకాశం వచ్చి స్క్రీన్ టెస్టు లో పాస్ అయినా యాంకరింగ్ ఒక ఏడు నెలలు మానేయమని చెప్పడంతో అవకాశం వదులుకుంది. ఆ తరువాత క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఛత్రపతి, మురారి, ఉయ్యాల జంపాల ఇలా చాలా సినిమాల్లో నటించిన అనిత ప్రస్తుతం బుల్లితెర, వెండితెరకు దూరంగా ఉంటున్నారు. అయితే ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె కెరీర్ పరమైన విశేషాలతో పాటు వ్యక్తిగత విషయాలను తెలిపారు.

శ్రీకాంత్, శివాజీ ఫోన్ చేసి ప్రేమించమన్నారు…
అనిత తల్లిదండ్రులది ప్రేమ వివాహం, తండ్రి కలకత్తాలో ఉద్యోగం చేయడం వల్ల అనిత అక్కడే పుట్టింది. ఆ తరువాత హైదరాబాద్ అనిత కుటుంబం రావడంతో అనిత చదువు అంతా హైదరాబాద్ లో సాగింది. ఐదో తరగతి చదివే సమయంలో తండ్రి దూరమవ్వడంతో తల్లి బాధ్యత తీసుకుంది. ఐదుగురు పిల్లలు బాధ్యత అమ్మ తీసుకుని పెంచడం అన్నీ చూసిన తనకు ప్రేమ, పెళ్లి గురించి విభిన్నమైన అభిప్రాయాలు ఉండేవని తెలిపారు అనిత. అందువల్లే ఇష్టపడినా పెళ్లి వరకు వెళ్ళలేదని చాలా బ్రేక్ అప్స్ జరిగాయంటూ తెలిపారు.

దీంతో తన భర్త మొదట ప్రపోజ్ చేసినా అమెరికా రాను అని రిజెక్ట్ చేసిందట. ఇక అనిత భర్త హీరో శ్రీకాంత్ కి కజిన్ కావడంతో శ్రీకాంత్ ఫోన్ చేసి అలాగే ఫ్రెండ్ అయిన శివాజీ కూడా ఫోన్ చేసి పెళ్లి చేసుకోవచ్చు కదా అని చెప్పారు. శ్రీకాంత్ ఫోన్ చేసి మావాడు అమెరికా నుండి వచ్చి నిన్ను పెళ్లిచేసుకుంటా అంటున్నాడు పెళ్లి చేసుకో అని చెబితే మొదట నాకు కదా చెప్పాలి నాకు చెప్పకుండా అందరికీ చెప్తున్నాడని ఒక మూడేళ్లు మాట్లాడలేదు, మళ్ళీ ఆఫీషియల్ గా వచ్చి అడగడంతో పెళ్లి చేసుకున్నాను అంటూ తన ప్రేమ వివాహం గురించి చెప్పింది.






























